Unstoppable 2: బాలకృష్ణ బర్త్ డేకి పవన్ కల్యాణ్.. ఎవరికీ తెలియని పార్టీ, సీక్రెట్ రివీల్!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన పేరు వింటే చాలు తెలుగు రాష్ట్రాల్లో విజిల్స్, అరుపులతో మోత మోగిపోతుంది. ఏ హీరో ఫంక్షన్​ అయినా సరే.. పవన్ కల్యాణ్​ అని పేరు వింటే చాలు.. రచ్చ రచ్చే. మెగాస్టార్​ చిరంజీవి తమ్ముడిగా వెండితెరకు పరిచయమైన పవన్​ కల్యాణ్ పవర్ స్టార్ గా ఎదిగారు. అలాగే ప్రజల కోసం సేవ చేసేందుకని రాజాకీయాల్లోకి దిగారు.

ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పాలిటిక్స్ లో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. ఇక ఆయన సినిమా వచ్చిందంటే అభిమానులకు పండగే. ఇదిలా ఉంటే తాజాగా ఆయన పాల్గొన్న అన్ స్టాపబుల్ షో ఎపిసోడ్ ను గురువారం రాత్రి 9 గంటలకు విడుదల చేసి విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్ లో బాలయ్య బర్త్ డే కు సంబంధించిన ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

 రెండో పార్టు అప్పుడు..

రెండో పార్టు అప్పుడు..

నందమూరి నటసింహం హోస్ట్ గా అదరగొడుతున్న టాక్ షో అన్ స్టాపబుల్. ఎంతో సక్సెస్ ఫుల్ గా నడిచిన అన్ స్టాపబుల్ రెండో సీజన్ త్వరలో ముగియనుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ప్రారంభం అయిన ఈ రెండో సీజన్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో పూర్తి కానుంది. అందుకోసం ఈ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా విడుదల చేశారు. మొదటి పార్టును ఫిబ్రవరి 2న ప్రసారం చేయగా.. రెండో పార్ట్ ను ఫిబ్రవరి 10 లేదా 17న స్ట్రీమింగ్ చేయనున్నట్లు టాక్ వినపిస్తోంది.

నా స్థానం మీ మనసు..

నా స్థానం మీ మనసు..

అన్ స్టాపబుల్ షోలోకి పవన్ కల్యాణ్ కు చాలా గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు నందమూరి బాలకృష్ణతో పాటు నిర్మాత అల్లు అరవింద్. స్టేజీపైకి పవన్ కల్యాణ్ ఎంట్రీతో హాలు మొత్తం అరుపులతో మారు మోగిపోయింది. బాలకృష్ణ ఆపమని చెప్పినా ఎవ్వరూ వినకుండా అలానే కొనసాగింది. తర్వాత ఈశ్వరా.. పవనేశ్వరా అని బండ్ల గణేష్ చెప్పిన డైలాగ్ ను బాలకృష్ణ చెప్పారు.

అనంతరం ఏది నా డైలాగ్ చెప్పమని బాలకృష్ణ అడిగితే.. సగం చెప్పేసి నవ్వేశారు పవన్. చూడండి ఎలా సిగ్గు పడతాడో అని బాలయ్య కామెడీ చేశారు. తర్వాత నేను మీకు తెలుసు.. నా స్థానం మీ మనసు అని పూర్తిగా బాలకృష్ణ డైలాగ్ ను పవన్ కల్యాణ్ చెప్పారు.

మొదటిసారి కలుసుకున్న పిక్..

మొదటిసారి కలుసుకున్న పిక్..

ముందుగా పవన్ కల్యాణ్ కు, బాలకృష్ణకు ఉన్న వ్యక్తిగత అనుబంధం గురించి మాట్లాడుకున్నారు. మనం ఎప్పుడు కలవమని, అస్సలు మాట్లాడుకోమని అందరూ అంటూ ఉండారు.

ఇదే మనం ఫస్ట్ టైమ్ కలవడం అని అనుకుంటున్నారు అని బాలకృష్ణ అంటే.. లేదిండి.. మనం కలుస్తూనే ఉంటాంగా అని పవన్ కల్యాణ్ అన్నారు. ఏది ఒక ఫొటో వేయండమ్మా అని బాలకృష్ణ, పవన్ మొదటిసారి కలుసుకున్న ఫొటో వేశారు. అది సుస్వాగతం సినిమా సమయంలోది అని పవన్ కల్యాణ్ చెప్పారు.

క్రికెట్ సమయంలో..

క్రికెట్ సమయంలో..

అప్పుడు నేను యంగ్ గా ఉన్నాను కదా అని బాలకృష్ణ అంటే.. ఇప్పటికీ అలాగే ఉన్నారు అని పవన్ కల్యాణ్ అన్నారు. తర్వాత నువ్ ఎప్పటికీ అలాగే ఉన్నావ్ అని బాలయ్య అంటే పవన్ నవ్వేశారు. కానీ చాలా థ్యాంక్స్ అమ్మా.. ఆరోజు 2014లో నా బర్త్ డేకు గ్రాండ్ కాకతీయకు వచ్చావ్ అని బాలకృష్ణ అంటే.. అవునండీ, నాకు గుర్తుంది. క్రికెట్ టైమ్ లో ఉనుకుంటా అని పవన్ కల్యాణ్ అన్నారు.

అప్పటి ఫొటోలు ఏం లేవు..

అప్పటి ఫొటోలు ఏం లేవు..

బాలకృష్ణ గారు చెన్నైలో ఉన్నప్పుడు... అన్నయ్య (చిరంజీవి) పుట్టినరోజుకు ప్రత్యేకా ఆహ్వానితులుగా వచ్చినప్పుడు నేను ఆయన్ను దూరం నుంచి చూసేవాడిని. అప్పటికీ నేను సినిమాల్లోకి రాలేదు. ఒకటి రెండు సందర్భాల్లో మిమ్మల్ని నాకు హనీ హౌజ్ లో పరిచయం అన్నయ్య చేశారు. కానీ అప్పటి పొటోలు ఏం లేవు అని పవన్ కల్యాణ్ తెలిపారు.

దానికి ఉందా అమ్మా ఇంకా హనీ హౌజ్ అని బాలకృష్ణ అడిగితే.. ఉందనుకుంటా సార్. గుర్తు లేదు కానీ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆ జ్ఞాపకాలు, ఆ తీపి గుర్తులే వేరు. చెన్నైలో ఉన్నప్పుడు ఎక్కువగా కలుసుకునేవాళ్లం అని బాలకృష్ణ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X