Unstoppable 2: జగదాంబ సెంటర్ లో అలా చేయమన్నారు.. సిగ్గుతో చచ్చిపోయాను.. పవన్ కల్యాణ్ షాకింగ్ కామెంట్స్!

పవర్ స్టార్ పవన్​ కల్యాణ్​.. ఈ పేరు వింటే చాలు తెలుగు రాష్ట్రాల్లో విజిల్స్, అరుపులతో మోత మోగిపోతుంది. ఏ హీరో ఫంక్షన్​ అయినా సరే.. పవన్ కల్యాణ్​ అని పేరు వింటే చాలు.. రచ్చ రచ్చే. మెగాస్టార్​ చిరంజీవి తమ్ముడిగా వెండితెరకు పరిచయమయ్యారు పవన్​ కల్యాణ్. మెగాస్టార్ తమ్ముడిగా ఎంటరైన పవన్ కల్యాణ్ తనదైన నటన, మ్యానరిజంతో అశేష అభిమానులను సంపాదించుకుని పవర్​ స్టార్​గా ఎదిగారు.

ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవన్ కల్యాణ్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ రానే వచ్చింది. రెండు భాగాలుగా రానున్న ఈ ఎపిసోడ్ మొదటి పార్టులో తను చాలా అవమానకంగా ఫీల్ అయిన సంఘటన గురించి షాకింగ్ గా చెప్పారు పవన్ కల్యాణ్.

అంతకు మించి అనేలా..

అంతకు మించి అనేలా..

నందమూరి నటసింహం హోస్ట్ గా అదరగొడుతున్న టాక్ షో అన్ స్టాపబుల్. ప్రస్తుతం ఈ టాక్ షో రెండో సీజన్ ఎంతో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ప్రారంభం అయిన ఈ రెండో సీజన్ లో ఎంతో మంది స్టార్స్ వచ్చి సందడి చేశారు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వచ్చిన ఎపిసోడ్ సెన్సేషన్ అయింది. ఇప్పుడు అంతకు మించి అనేలా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎపిసోడ్ ఉంది.

తొలిసారిగా లైవ్ స్ట్రీమింగ్..

తొలిసారిగా లైవ్ స్ట్రీమింగ్..

నందమూరి నటసింహం బాలయ్య బాబు హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ రెండో సీజన్ ను పవన్ కల్యాణ్ తో ముగించనున్నారు. ఇందుకోసం ఆహా కూడా భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేశారు. హైదరాబాదులో కొన్ని ఏరియాలలో బాలకృష్ణ పవన్ కల్యాణ్ కు సంబంధించిన కటౌట్స్ ఉండగా.. దేశంలోనే తొలిసారిగా ఈ టాక్ షోను లైవ్ స్ట్రీమింగ్ చేశారు.

అలాగే ఈ ఎపిసోడ్ కోసం ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రత్యేక షోలు కూడా వేశారు. దీన్ని బట్టే అర్థమవుతోంది పవన్ కల్యాణ్ ఎపిసోడ్ కు ఎలా ప్లాన్ చేశారని.

నా డైలాగ్ చెప్పు..

నా డైలాగ్ చెప్పు..

పవన్ కల్యాణ్ చాలా గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు నందమూరి బాలకృష్ణతో పాటు నిర్మాత అల్లు అరవింద్. స్టేజీపైకి పవన్ కల్యాణ్ ఎంట్రీతో హాలు మొత్తం అరుపులతో మారు మోగిపోయింది. బాలకృష్ణ ఆపమని చెప్పినా ఎవ్వరూ వినకుండా అలానే కొనసాగింది.

తర్వాత ఈశ్వరా.. పవనేశ్వరా అని బండ్ల గణేష్ చెప్పిన డైలాగ్ ను బాలకృష్ణ చెప్పారు. అనంతరం ఏది నా డైలాగ్ చెప్పమని బాలకృష్ణ అడిగితే.. సగం చెప్పేసి నవ్వేశారు పవన్. చూడండి ఎలా సిగ్గు పడతాడో అని బాలయ్య కామెడీ చేశారు. తర్వాత నేను మీకు తెలుసు.. నా స్థానం మీ మనసు అని పూర్తిగా బాలకృష్ణ డైలాగ్ ను పవన్ కల్యాణ్ చెప్పారు.

చాలా సిగ్గు పడిన సంఘటన..

చాలా సిగ్గు పడిన సంఘటన..

నేను నీకు సీనియర్ ని కాబట్టి.. గారు అని పిలవలేను.. భయ్యా అని పిలుస్తాను బాలయ్య అంటే.. సంతోషం అని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రశ్నలు అడిగే క్రమంలో.. "భయ్యా.. మీరు చాలా సిగ్గు పడిపోతుంటారు కదా.. చాలా ఇబ్బంది పడిపోయుంటారు. పది మంది కనిపిస్తేనే.. మెలికలు తిరిగిపోయే రకం కాబట్టి నేను ఒకటి అడుగుతున్నా.. ఇప్పుడు మీ జీవితంలో చాలా సిగ్గుపడిన సంఘటన.. నేనా ఇలా అని అనిపించే ఎపిసోడ్ ఏంటీ" అని పవన్ కల్యాణ్ ను బాలకృష్ణ అడిగారు.

ఇక నేను సినిమాలు చేయను..

ఇక నేను సినిమాలు చేయను..

బాగా సిగ్గు పడిన విషయం గురించి బాలయ్య అడగ్గా.. "సుస్వాగతం సినిమా షూటింగ్ సమయంలో.. జగదాంబ సెంటర్ లో ఒక పాటకి బస్సుపై డ్యాన్స్ పెట్టారండి. అది కంపోజ్ చేసింది లారెన్స్ అనుకుంటా. బస్సుపై డ్యాన్స్ చేయమంటే ఆరోజు సిగ్గుతో చచ్చిపోయాను. వెంటనే మా వదినకు కాల్ చేశాను. ఇదే నా లాస్ట్ సినిమా ఇంకా నావల్ల కాదు. ఇక నేను చేయలేను. ఎందుకంటే.. నాకు చాలా ఇబ్బంది అయిపోయింది" అని పవన్ కల్యాణ్ తెలిపారు.

కారుపై కూర్చుని వెళ్లే స్థాయికి..

కారుపై కూర్చుని వెళ్లే స్థాయికి..

పవన్ కల్యాణ్ ఇంకా కొనసాగిస్తూ.. "నాకు అస్సలు సంబంధం లేని పనిచేస్తున్నాను ఏంటీ. ఇంట్లో పది మంది ఉంటే బయటకు వచ్చేందుకు తెగ ఇబ్బంది పడిపోయేవాన్ని. అలాంటి ఒక జగదాంబ వంటి మెయిన్ సెంటర్ లోకి తీసుకెళ్లి.. ఆ బస్సుపై పెడితే అందరూ నన్నే చూస్తున్నారు. భూమాత లోపలి నుంచి వచ్చి నా దగ్గరకు వచ్చేయ్ అనేంత సిగ్గు వచ్చింది" అని నవ్వుతూ తెలిపారు.

బస్సుపై ఎక్కి డ్యాన్స్ చేసేందుకు సిగ్గు పడిన స్టేజీ నుంచి కారుపై కూర్చుని వెళ్లే స్థాయికి వచ్చావ్ అని బాలయ్య అన్నారు. దానికి ఇదంతా నాకే జరుగుతుందా అని అనిపిస్తుంటుంది అని పవన్ కల్యాణ్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X