Unstoppable 2: సీఎం అయ్యాక చచ్చిపోతా.. సినిమాలు వదిలేసి పూర్తిగా.. పవన్ కల్యాణ్ ఘాటు సమాధానాలు

అన్ స్టాపబుల్ షో రెండో సీజన్ బీభత్సంగా దూసుకుపోతోంది. ఇంతకుముందు వచ్చిన ఎపిసోడ్స్ ఒక లెక్క.. తాజాగా వచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎపిసోడ్ మరొ లెక్క అన్నట్లుగా మారింది. మహేశ్ బాబు, ప్రభాస్ ఎపిసోడ్స్ కు మించిన రెస్పాన్స్ పనన్ కల్యాణ్ ఎపిసోడ్ కు వస్తోందని ఇప్పటికే పలు వార్తలు వచ్చాయి.

అంతేకాకుండా అతి తక్కువ సమయంలో 100 మిలియిన్ వ్యూస్ దాటిన ఎపిసోడ్ గా పవన్ కల్యాణ్ ఎపిసోడ్ మొదటి పార్ట్ నమోదు చేసిందని ఆహా వర్గాలు వెల్లడించాయి. ఇదే జోరుతో త్వరలో ఈ ఎపిసోడ్ రెండో పార్టును కూడా విడుదల చేయనున్నారు. అయితే ఈ రెండో పార్టుకు సంబంధించిన ప్రోమోను తాజాగా సోషల్ మీడియాలో వదిలారు.

బీభత్సమైన రెస్పాన్స్..

బీభత్సమైన రెస్పాన్స్..

నందమూరి నటసింహం హోస్ట్ గా అదరగొడుతున్న టాక్ షో అన్ స్టాపబుల్. ఎంతో సక్సెస్ ఫుల్ గా నడిచిన అన్ స్టాపబుల్ రెండో సీజన్ త్వరలో ముగియనుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ప్రారంభం అయిన ఈ రెండో సీజన్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో పూర్తి కానుంది. అందుకోసం ఈ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా విడుదల చేయనున్న విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ ఎపిసోడ్ మొదటి పార్టును ఫిబ్రవరి 2న రాత్రి 9 గంటలకు ప్రసారం చేయగా.. దానికి బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది.

జేబులో ఏం పెట్టుకుని వచ్చావ్..

జేబులో ఏం పెట్టుకుని వచ్చావ్..

పవన్ కల్యాణ్ అన్ స్టాపబుల్ రెండో సీజన్ ఎపిసోడ్ మొదటి పార్టుకు విడుదలైన అతి తక్కువ సమయంలోనే అత్యధిక మిలియన్ వ్యూస్ సాధించినట్లు ఆహా టీమ్ వెల్లడించింది. దీంతో మరింత జోరుగా రెండో పార్టు ప్రోమోను తాజాగా విడుదల చేశారు. అయితే పవన్ కల్యాణ్ బ్లాక్ హుడీ వేసుకొచ్చిన విషయం తెలిసిందే. ఎపిసోడ్ మొదటి పార్టులో తన హుడీ పాకెట్స్ లో ప్రతిసారి చేతులు పెట్టుకుంటూ కనిపించాడు పవన్ కల్యాణ్. దీంతో రెండో పార్ట్ ప్రోమోలో జేబులో ఏం పెట్టుకోని వచ్చావ్ అని పవన్ ను బాలయ్య అడిగారు.

చాలా కాలం తర్వాత తిక్క వచ్చింది..

చాలా కాలం తర్వాత తిక్క వచ్చింది..

జేబులో ఏం పెట్టుకోని వచ్చావన్న బాలయ్య ప్రశ్నకు.. ఏం లేదని ఖాళీ చేతులు చూపించారు పవన్ కల్యాణ్. దీంతో నాకు ఏమనిపిస్తుందో తెలుసా.. ఎవరినీ కొట్టకుండా ఆపుకోవడానికి అలా జేబులో చేతులు పెట్టుకుంటున్నావామో అని బాలకృష్ణ అంటే.. పవన్ కల్యాణ్ నవ్వారు. తర్వాత పవన్ కల్యాణ్ కారు టాప్ పై కూర్చుని ట్రావెల్ చేసిన ఫొటో వేశారు.

ఏంటా గొడవ అని బాలకృష్ణ సూటిగా ప్రశ్నిస్తే.. కారులో వెళ్లకూడదు.. కారులో నుంచి బయటకు రాకూడదు.. రూమ్ లో ఉండకూడదు.. రూమ్ లో నుంచి బయటకు రాకూడదు. చాలా కాలం తర్వాత నాకు కొంచెం తిక్క వచ్చింది అందుకే అలా అన్నట్లుగా పవన్ కల్యాణ్ ఘాటు సమాధానం ఇచ్చారు.

 టీడీపీలో జాయిన్ కావాల్సింది..

టీడీపీలో జాయిన్ కావాల్సింది..

అధికార యంత్రాంగం కూడా మరి హద్దులు దాటేసి అంటూ పవన్ కల్యాణ్ మాటలను సస్పెన్సింగ్ గా చూపించారు. తర్వాత నేను కూడా ఒక పార్టీ పెట్టాలని అనిపించింది అని పవన్ కల్యాణ్ అనుకున్నట్లుగా బాలకృష్ణ చెప్పారు. ఎంతసేపు మనం ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడతాం కానీ, ప్రాథమిక బాధ్యతల గురించి మాట్లాడం అని పవన్ కల్యాణ్ అంటే.. నువ్ తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావాల్సింది అని బాలకృష్ణ అన్నారు. అప్పుడు బేసిక్ గా పాలిటిక్స్ లో ఆధిపత్య ధోరణి అంటారు అని పవన్ చెప్పారు.

అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు..

అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు..

నీ మెనిఫెస్టో పూర్తిగా జనాల్లోకి వెళ్లకపోవడం వల్లేమో.. రాష్ట్రంలో నీ ఫ్యాన్ కానివారు అంటూ ఎవరు లేరు. ఆ ప్రేమ ఓట్ల దాకా ఎందుకు కన్వర్ట్ కాలేదని మీ ఉద్దేశం అని బాలయ్య అంటే.. ఆలోచనలో పడిన పవన్ కల్యాణ్.. ఒకరు ఎదుగుతా ఉంటే వాళ్లని రానివ్వకుండా చేసేది వారి వ్యూహంలో భాగం అంతే అని పవన్ చెప్పారు. అసలు నువ్వు ఏం తప్పు చేశావ్ అని నీ మీద బాలయ్య అంటుంటే.. దాదాపు అటెంప్ట్ మర్డర్ కేస్ పెట్టారు. ఎవరు ఎదురు చెప్పకూడదు. అది ఒక నియతృంత్వ ప్రవర్తన అని పవన్ చెప్పారు.

సింహం, పులి మధ్యలో నా తల..

సింహం, పులి మధ్యలో నా తల..

అనంతరం స్టేజీపైకి ఒక ముసలావిడ వచ్చారు. నాకు ఇద్దరు కొడుకులు కరోనా వచ్చి చచ్చిపోయారు. ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకికి ఈ కొడుకు (పవన్ కల్యాణ్) తోడు. పవన్ కల్యాణ్ సీఎం అయ్యాక అప్పుడు చచ్చిపోతానయ్యా నేను అని ఆమె ఎమోషనల్ గా చెప్పారు. దీంతో ఆమె కాళ్లకు పవన్ కల్యాణ్ నమస్కరించారు. తర్వాత హరి హర హర వీరమల్లు డైరెక్టర్ క్రిష్ ఎంట్రీ ఇచ్చారు. మా ఇద్దరితో వర్క్ చేశావ్ కదా. ఏంటీ డిఫరెన్స్ అని బాలయ్య అంటే.. ఒక సింహం, ఒక పులి మధ్యలో నా తల ఉంది అని క్రిష్ అన్నారు.

ఇరుకున పెడితే అణుబాంబు అవుతుంది..

ఇక భయ్యా సినిమాలు మానేసి.. ప్రజా సేవకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని ఆడియెన్స్ మధ్య పోలింగ్ పెట్టారు బాలయ్య. వారిలో క్రిష్ తో పాటు అందరూ అవును అని అన్నారు. ఈ మధ్య నీ విమర్శలు.. వాడీ వేడీ బాగా ఇంపాక్ట్ అయింది అని బాలయ్య అంటే.. లేదండి నేను చాలా పద్ధతిగా మాట్లాడతాను అని పవన్ అన్నారు. అనువనువునా ఇరుకున పెడితే అణుబాంబు అవుతుంది అని బాలకృష్ణ చెబితే.. వా.. సూపర్ డైలాగ్ అన్నట్లుగా పవన్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చారు. ఇక పవన్ కల్యాణ్ ఎపిసోడ్ రెండో పార్టును ఫిబ్రవరి 10న విడుదల చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X