BRO, Baby Movies: OTT లోకి వచ్చేసిన బేబీ, బ్రో సినిమాలు... ఆ సీన్స్ కూడా యాడ్... స్ట్రీమింగ్ ఎందులో అంటే?

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఆ రెండు సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. ఈ వారం ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నా... ముఖ్యంగా ఆ రెండు సినిమాల కోసమే ప్రేక్షకులు వెయింటింగ్. అవే బ్రో, బేబి సినిమాలు. ఇవి ఈరోజు ఆగస్టు 25వ తేదీన ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాలు ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బేబీ, బ్రో.. ఈ రెండు సినిమాలు ఓటీటీలో ఎప్పుడు విడుదల అవుతాయా అని మూవీ లవర్స్ ఎదురుచూశారు. వారి ఎదురుచూపులకు నేటితో పుల్ స్టాప్ పడింది. ఈ రెండు సినిమాలో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇంత కాలం థియేటర్లలో అలరించిన ఈ మూవీస్ ఓటీటీ వేదికగా రచ్చ లేపేందుకు సిద్ధం అయ్యాయి. 24వ తేదీ అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ వచ్చేసిన ఈ మూవీస్.. సీని లవర్స్ పండగ చేసుకుంటున్నారు.

Pawan Kalyan BRO Movie And Anand Devarakonda Baby Movie Streaming Now on Netflix, Aha Otts

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటించిన చిత్రం బ్రో. ఈ మూవీని తమిళ నటుడు, దర్శకుడు సముద్ర ఖని డైరెక్ట్ చేశారు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ఈ మూవీకి తమన్ సంగీతం అందిచారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ. విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహా నిర్మాతగా వ్యవహారించారు.

ఇక ఈ సినిమా జులై 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదల అయిన మొదటి రోజు నుంచే ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. దానితో పాటు పలు వివాదాలు కూడా తలెత్తాయి. ఇక ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఆగస్టు 25నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. మీరు గనుక ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయితే.. ఓటీటీలో ఎంచక్కా చూసేయండి. ఇక ఈమూవీని జీ తెలుగు శాటిలైట్ రైట్స్ తీసుకుంది.

Pawan Kalyan BRO Movie And Anand Devarakonda Baby Movie Streaming Now on Netflix, Aha Otts

ఇక చిన్న సినిమాగా రిలీజ్ అయి.. ప్రభంజనం సృష్టించిన చిత్రం బేబీ. ఇక ఈ మూవీ కోసం సినీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య లు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బేబి. ఈ సినిమాకు సాయి రాజేశ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను శ్రీనివాస కుమార్ (ఎస్కేఎన్) నిర్మించారు. విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం ఈ సినిమాకు హైలెట్ అని చెప్పవచ్చు.

ఇక బేబీ మూవీ జులై 14వ తేదీన థియేటర్లోకి వచ్చేసింది. విడుదలైన మొదటి రోజు నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లింది. ఇక ఈ సినిమా యూత్ కు బాగా కనెక్ట్ అయింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ మూవీ... దాదాపు 100 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించి సూపర్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమా ఇప్పుడు ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఆగస్టు 25వ తేదీ నుంచే ఈ సినిమా స్ట్రీమ్ అవుతుంది. అయితే బేబీలో కొన్ని ఎక్స్ ట్రా సీన్స్ కూడా యాడ్ చేశారు. అయితే ఆహా గోల్డ్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్న వారికి 12 గంటల ముందే ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. మీరు గనుక ఈ సినిమాను థియేటర్లలో చూసినా, చూడకపోయినా.. మరోసారి ఓటీటీలో చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X