Bro OTT: భారీ ధరకు బ్రో ఓటీటీ రైట్స్.. నిర్మాత క్లారిటీ.. ఆ రెండింట్లో స్ట్రీమింగ్

ఓవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలతో ఫుల్ బిజీగా మారారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ వంటి సినిమాలతో, రాజకీయ ప్రచారాలతో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ ఇటీవల బ్రో (Bro Movie) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పవన్ భక్తులకు ఫుల్ ఎంటర్టైన్ మెంట్ ఇవ్వగా.. కామన్ ఆడియెన్స్ కు మాత్రం కాస్తా నిరాశనిచ్చింది. ఫస్ట్ వీక్ లో కలెక్షన్లతో అదరగొట్టిన బ్రో వర్కింగ్ డేస్ లో డీలా పడిపోయింది. ఇదిలా ఉంటే బ్రో సినిమా ఓటీటీ (Bro OTT) పార్టనర్, డీల్ కు సంబంధించి విషయాలు ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యాయి.

మామ అల్లుళ్లు పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్ తొలిసారిగా కలిసి నటించిన మెగా మల్టీ స్టారర్ చిత్రం బ్రో. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా, వివేక్ కూచిబోట్ల సహా నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. తమన్ సంగీతం ఇచ్చారు. రొమాంటిక్ బ్యూటి కేతిక శర్మ, వింక్ భామ ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటించారు. సీనియర్ నటి రోహిణి, బ్రహ్మానందం ముఖ్య పాత్రలు పోషించారు.

Pawan Kalyan Bro Movie OTT Rights To Netflix And Zee5 For Huge Price

బ్రో సినిమా జూలై 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాకు మిక్స్ డ్ రెస్పాన్స్ వస్తోంది. పవన్ కల్యాణ్ తన ఎనర్జీతో అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చాడని అంటుంటే రెగ్యులర్ గా ఉందని కామన్ ఆడియెన్స్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బ్రో ఓటీటీ రైట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. పవన్ కల్యాణ్ స్థాయికి తగినట్లుగా నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయని ఇటీవల నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు.

బ్రో ఓటీటీ రైట్స్ నెట్ ఫ్లిక్స్ తోపాటు సినిమా నిర్మాణంలో భాగం పంచుకున్న జీటీవి కూడా వెళ్లినట్లు నిర్మాత మాటల ద్వారా తెలుస్తోంది. బ్రో డిజిటల్ హక్కుల కోసం ఓటీటీ సంస్థలు భారీగానే చెల్లించినట్లు సమాచారం. ఇక ఈ సినిమాను ఆగస్టు చివరి వారం, లేదాసెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో స్ట్రీమింగ్ చేయనున్నారని ఇదివరకే టాక్ నడిచింది. అయితే ఎక్కువగా వినిపిస్తున్న టాక్ ఏంటంటే పవన్ కల్యాణ్ పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 2న అటు నెట్ ప్లిక్స్, ఇటు జీ5 ఓటీటీల్లో బ్రో సినిమాను ప్రదర్శించనున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X