Unstoppable 2: ఆ ఏజ్ నుంచి ఆ ఆరోగ్య సమస్య.. అలా చనిపోదాం అనుకున్నా.. పవన్ సంచలన వ్యాఖ్యలు

తెలుగులో ఎన్నో రకాల టాక్ షోలు వచ్చాయి. కానీ, వాటన్నింటి కంటే దేశ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్నది మాత్రం నటసింహా నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న 'Unstoppable with NBK' అని చెప్పొచ్చు. సెలెబ్రిటీలతో నడిచే టాక్ షో రికార్డుల దుమ్ముదులిపేస్తూ దూసుకుపోతోంది. ఫలితంగా మొదటి సీజన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుని.. ఇప్పుడు రెండో దాన్ని కంప్లీట్ చేసుకుంది. ఇక, ఫినాలే ఎపిసోడ్‌లో పవన్ కల్యాణ్.. బాలయ్యతో కలిసి సందడి చేశాడు. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ ఆత్మహత్యాయత్నంపై క్లారిటీ ఇచ్చాడు. ఆ వివరాలు మీకోసం!

ఫినాలే ఎపిసోడ్‌.. రెండో పార్టుతో

ఫినాలే ఎపిసోడ్‌.. రెండో పార్టుతో

తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో వస్తున్న 'Unstoppable with NBK 2' షోలో భాగంగా ఫినాలే ఎపిసోడ్‌లో పాల్గొనేందుకు గానూ టాలీవుడ్ టాప్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గెస్టుగా వచ్చాడు. దీన్ని రెండు పార్టులుగా స్ట్రీమింగ్ చేస్తున్నట్లు టీమ్ ముందే ప్రకటించింది. ఇందులో మొదటి దాన్ని ఫిబ్రవరి 2వ తేదీన స్ట్రీమింగ్ చేయగా.. రెండో దాన్ని మాత్రం నేడే వదిలారు.

రాజకీయాలపై బాగా ఫోకస్ చేసి

రాజకీయాలపై బాగా ఫోకస్ చేసి

మొదటి భాగంలో పవన్ కల్యాణ్ పర్సనల్ విషయాల మీదనే ఫోకస్ చేసిన హోస్ట్ నందమూరి బాలకృష్ణ.. రెండో పార్టులో మాత్రం పవర్ స్టార్ పొలిటికల్ కెరీర్‌పై ప్రశ్నలు అడిగారు. ముఖ్యంగా జనసేన పార్టీ స్థాపన వెనుక ఉన్న విషయాలను ప్రస్తావించారు. అలాగే, రాజకీయాలు, సేవలు, విరాళాలు తదితర అంశాల గురించి మాట్లాడుతూ పవన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

బాలయ్యపై పవన్ ప్రశంసలు

బాలయ్యపై పవన్ ప్రశంసలు

'Unstoppable with NBK 2' ఫినాలే ఎపిసోడ్ పార్ట్ 2లో బాలయ్య గురించి పవన్ మాట్లాడుతూ.. 'బాలకృష్ణది ముక్కుసూటి వ్యక్తిత్వం. కల్మషం లేని ఆలోచనా విధానం. ఆయన మాటలు గుండెల్లోంచి వస్తాయి. ఈ షోకు రాకముందు ఎలా అనుకున్నానో.. ఇప్పుడు మిమ్మల్ని కలిసిన తర్వాత అలాగే అనుకుంటున్నా. మీరు రాజకీయాల్లో రాణించాలని కోరుతున్నా' అన్నాడు.

ఆత్మహత్య ఎపిసోడ్‌పై క్లారిటీ

ఆత్మహత్య ఎపిసోడ్‌పై క్లారిటీ

గతంలో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నట్లు పవన్ కల్యాణ్ పలుమార్లు వెల్లడించాడు. దీన్ని 'Unstoppable with NBK 2'లో నందమూరి బాలకృష్ణ ప్రస్తావిస్తూ ప్రశ్నించారు. దీంతో పవన్ కల్యాణ్ ఆ ఎపిసోడ్ గురించి క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు, తాను చదువుకునే రోజుల్లో డిప్రెషన్‌కు గురైన విషయాలను కూడా వివరించి చెప్పాడు.

చిన్నప్పుడు ఆ ఆరోగ్య సమస్య

చిన్నప్పుడు ఆ ఆరోగ్య సమస్య

ఈ షోలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. 'నాకు చిన్నప్పటి నుంచి ఆస్తమా, జ్వరం సమస్యలు ఉండేవి. ముఖ్యంగా ఆరు, ఏడు తరగతుల్లో ఉన్నప్పుడు అనారోగ్యానికి గురయ్యేవాడిని. ఆ సమయంలో ఫ్రెండ్స్ లేక ఇంట్లోనే ఉండాల్సి వచ్చేది. దీంతో పుస్తకాలనే స్నేహితులు అనుకునేవాడిని. అంతేకాదు, స్కూల్, కాలేజ్‌కు వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడేవాడిని' అని చెప్పాడు.

చాలా క్రుంగిపోయాను అంటూ

చాలా క్రుంగిపోయాను అంటూ

ఆ తర్వాత ఇదే విషయంపై పవన్ కల్యాణ్ కంటిన్యూ చేస్తూ.. 'నాకు స్కూల్స్ మాత్రమే కాదు.. టీచర్స్ కూడా అస్సలు నచ్చేవారు కాదు. అందుకే ప్రతిదాన్ని సొంతంగా నేర్చుకునేవాడిని. ఒకవైపు స్నేహితులు చదువు, ఆటల్లో రాణిస్తూ ఉంటే నేను ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయ్యేవాడిని. ఇలా 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడే మానసికంగా బాగా క్రుంగిపోయాను' అంటూ వివరించాడు.

తుపాకీతో కాల్చుకుందామని

తుపాకీతో కాల్చుకుందామని

పవన్ కొనసాగిస్తూ.. 'ఒత్తిడిని భరించలేక చనిపోదాం అనుకున్నాను. వెంటనే అన్నయ్య దగ్గరున్న లైసెన్స్ పిస్టల్ తీసుకుని కాల్చుకుందాం అనుకున్నా. సురేఖ వదిన, నాగబాబు అన్నయ్య నన్ను చూసి ప్రశ్నించగా ఈ విషయం చెప్పాను. దీంతో వాళ్లు చిరంజీవి అన్నయ్య దగ్గరకు తీసుకెళ్లారు. ఆయన చదవకపోయినా పర్లేదు.. బ్రతికుండు అన్నారు' అని చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X