Pawan Kalyan: పెళ్లిళ్లపై పెదవి విప్పిన పవన్.. అందుకే ఆ ఇద్దరికీ విడాకులు.. అంత మాట అనేసిన బాలయ్య

రెండేళ్లుగా తెలుగు రాష్ట్రాలతో పాటు నేషనల్ రేంజ్‌లో హైలైట్ అవుతూ దూసుకుపోతోన్న షోలలో నటసింహా నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న 'Unstoppable with NBK' ఒకటి. సినీ సెలెబ్రిటీలతో నడిచే టాక్ షో రికార్డుల దుమ్ముదులిపేస్తూ రచ్చ లేపుతోంది. ఫలితంగా మొదటి సీజన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుని.. ఇప్పుడు రెండో దాన్ని నడుపుకుంటోంది. ఇక, ఇందులో ఫినాలే ఎపిసోడ్‌లో పవన్ కల్యాణ్.. బాలయ్యతో కలిసి తెగ సందడి చేశాడు. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ తన పెళ్లిళ్ల గురించి క్లారిటీ ఇచ్చాడు. అసలు ఆ సంగతులేంటో మీరే చూడండి!

ఫినాలే ఎపిసోడ్‌లో పవన్ కల్యాణ్

ఫినాలే ఎపిసోడ్‌లో పవన్ కల్యాణ్

ఆహాలో వస్తున్న 'Unstoppable with NBK 2' షోలో భాగంగా ఫినాలే ఎపిసోడ్‌లో పాల్గొనేందుకు గానూ టాలీవుడ్ టాప్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గెస్టుగా వచ్చాడు. అతడికి భారీ స్థాయిలో ఎలివేషన్ ఇచ్చి మరీ షో హోస్ట్ నటసింహా నందమూరి బాలకృష్ణ షోలోకి సాదర స్వాగతం పలికారు. ఆ తర్వాత పవన్‌ను ఆప్యాయంగా కౌగిలించుకుని స్టేజ్ మీదకు ఆహ్వానించారు.

 ఎవరికి వారే అన్నట్లుగా ఎపిసోడ్

ఎవరికి వారే అన్నట్లుగా ఎపిసోడ్

'Unstoppable with NBK 2' ఫినాలే ఎపిసోడ్ మొదటి పార్టులో షోలోకి గెస్టుగా వచ్చిన పవన్ కల్యాణ్‌ను అతడి ప్రాజెక్టులు, రాజకీయాలు సహా ఎన్నో విషయాల గురించి నందమూరి బాలకృష్ణ ప్రశ్నించారు. అలాగే, ఈ స్టార్ హీరోతో కొన్ని గేమ్స్ కూడా ఆడించారు. మొత్తంగా ఈ ఎపిసోడ్‌లో ఎవరికి వారే అన్నట్లుగా మాట్లాడారు. ఫలితంగా ప్రేక్షకులకు మజాను అందించారు.

3 పెళ్లిళ్లపై బాలయ్య ప్రశ్నించగా

3 పెళ్లిళ్లపై బాలయ్య ప్రశ్నించగా

'Unstoppable with NBK 2' ఫినాలే ఎపిసోడ్‌కు గెస్టుగా వచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను నందమూరి బాలకృష్ణ పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలను కూడా అడిగారు. ఇందులో భాగంగానే 'అసలు ఈ పెళ్లిళ్ల గొడవేంటి భయ్యా' అని సూటిగా ప్రశ్నించారు. దీంతో తొలిసారి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన మూడు పెళ్లిళ్ల గురించి స్పందించి వివరించాడు.

సంప్రదాయంగా బతికే వ్యక్తినని

సంప్రదాయంగా బతికే వ్యక్తినని


హోస్ట్ నందమూరి బాలకృష్ణ అడిగిన ప్రశ్నకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. 'నేను జీవితంలో అస్సలు పెళ్లి చేసుకోవాలనుకోలేదు. బ్రహ్మచారిగా ఉండిపోవాలి.. యోగమార్గంలో కలిసిపోవాలి అనుకున్నా. అక్కడ నుంచి నా జీవిత ప్రయాణం చూస్తే నాకే ఇలా జరిగిందా అనిపిస్తుంటుంది. వాస్తవానికి నేను చాలా సంప్రదాయంగా బతికే వ్యక్తిని' అని చెప్పుకొచ్చాడు

ఆ ఇద్దరికి అందుకే విడాకులు

ఆ ఇద్దరికి అందుకే విడాకులు

ఆ తర్వాత పవన్ కల్యాణ్ 'ఫస్ట్‌ మ్యారేజ్‌ ఇంట్లో వాళ్లు చూసి సంబంధం. రిలేషన్‌షిప్‌లో కొన్ని కుదరవు కాబట్టి విడిపోవాల్సి వస్తుంది. రెండోసారి చేసుకున్నప్పుడు కూడా అభిప్రాయ భేదాల్లాంటివి వచ్చాయి. కొన్ని విషయాల్లో ఏకాభిప్రాయం రాలేదు. అవి వేరే పరిస్థితులు. అందుకే తప్పలేదు' అంటూ ఇద్దరు భార్యలతో ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో వెల్లడించాడు.

కోరికలు.. వ్యామోహం అంటూ

కోరికలు.. వ్యామోహం అంటూ

పవన్ కల్యాణ్ కంటిన్యూ చేస్తూ.. 'అందరూ మూడు పెళ్లిళ్లు అంటుంటే.. ముగ్గుర్ని ఒకేసారి చేసుకోలేదురా బాబూ. ముగ్గురితో ఒకేసారి ఉండలేదు. ఒక వ్యక్తితో కుదరలేదు. రెండోసారి చేసుకున్నాను. వాళ్లతో కూడా కుదరలేదు. ఇంకోసారి చేసుకున్నాను. నేను కోరికతోనో, వ్యామోహంతోనో చేసుకోలేదు. అలా జరిగాయి అంతే' అంటూ కాస్త ఘాటుగానే సమాధానం చెప్పాడు.

నాకు గిల్ట్ ఫీలింగ్ లేదు అంటూ

నాకు గిల్ట్ ఫీలింగ్ లేదు అంటూ

అనంతరం పవన్ 'రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి విమర్శించడానికి అది ఒక ఆయుధం అయింది. నేను కూడా అవి పెద్దగా పట్టించుకోను. లోపల నాకు ఆ విషయంలో గిల్టీ ఫీలింగ్ లేదు. ముగ్గురిని ఒకేసారి పెళ్లి చేసుకుని, ఒకే ఇంట్లో పెట్టలేదు. ఒకరి మీద నెగిటివ్ ఇమేజ్ క్రియేట్ చేయడం నాకు పెద్ద విషయం కాదు. కానీ నాకు సంస్కారం, సభ్యత ఉన్నాయి. కాబట్టి వాటి గురించి మాట్లాడను. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే గొడవల కారణంగానే అలా అయింది' అని చెప్పుకొచ్చాడు.

ఊరకుక్కలతో సమానమంటూ

ఊరకుక్కలతో సమానమంటూ

ఈ విషయంపై పవన్ 'ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా విమర్శించాలంటే నాకు వాళ్ల ఇంట్లో ఆడపడుచులు గుర్తొస్తారు. నా సంస్కారం మాట్లాడనివ్వకుండా ఆపేస్తుంది. పెద్దలు బాలకృష్ణ ఎదురుగా ఉన్నారు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను' అని చెప్పాడు. దీంతో బాలయ్య 'ఇంకోసారి ఆయన గురించి, పెళ్లిళ్ల గురించి మాట్లాడితే మీరు ఊరకుక్కలతో సమానం' అని లాస్ట్ పంచ్ వేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X