ఇంకా ముందుగానే ఓటీటీలోకి.. హరి హర వీరమల్లు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పిరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ హరి హర వీరమల్లు చిత్రం జూలై 24న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. 5 ఏళ్లుగా ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉండగా ఎట్టకేళలకు థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైన అలరిస్తోంది. పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సినిమా ఫెస్టివల్ ను అందించింది. కానీ కథ పరంగా సినిమాకు పెద్దగా రెస్పాన్స్ దక్కలేదని ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ తో తెలుస్తోంది. ఇదిలా ఉంటే హరి హర వీరమల్లు చిత్రం ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. ముందుగా నిర్ణయించిన డేట్ కంటే ఈ సినిమా ఇంకా ముందుగానే స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ఆ వివరాల్లోకి వెళితే..

హరి హర వీరమల్లు ఓటీటీ ప్రైజ్..
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు చిత్రంతో మూడేళ్ల తర్వాత వెండితెరపైకి వచ్చిన సందర్భంగా సినిమాకు భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ ప్రైజ్ కూడా భారీగానే పలికింది. ఓటీటీలో విడుదలకు హరి హర వీరమల్లు మేకర్స్ రైట్స్ ను రూ.50 కోట్లకు అమ్మేసినట్టు ట్రేడ్ నిపుణులు తెలిపారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమోజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది.

Pawan Kalyan Hari Hara Veera Mallu Movie set to Early Release in OTT

హరి హర వీరమల్లు ఓటీటీ రిలీజ్ డేట్..
హరి హర వీరమల్లు చిత్రానికి సంబంధించిన ఓటీటీ రైట్స్ ను దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రస్తుతం థియేట్రికల్ గా ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ ను కాస్తా తగ్గించుకుంది. దీంతో ముందుగా హరి హర వీరమల్లు చిత్రాన్ని ఆగస్టు 22న విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ ప్రస్తుతం ప్రీపోన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆగస్టు 15నే స్ట్రీమింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం. దీనిపై ఇంకా అధికారిక అప్డేట్ రావాల్సి ఉంది. ప్రస్తుతం స్ట్రాంగ్ బజ్ క్రియేట్ అయ్యింది.

హరి హర వీరమల్లు బాక్సాఫీస్..
జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే సాధిస్తోంది. తొలి వీకెండ్ తో రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఇప్పటి వరకు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 109 కోట్ల రూపాయాల గ్రాస్, 80.86 ఇండియా నెట్ వసూల్ చేసిందని సాక్ నిల్క్ రిపోర్ట్ ఇచ్చింది. ఇక ఈ చిత్రానికి వారం రోజుల్లోనే ఓవర్సీస్ లో 14.25 కోట్లు వసూల్ చేయడం విశేషం.

ఇక హరి హర వీరమల్లు చిత్రాన్ని పార్ట్ 1 ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. క్రిష్ జాగర్లముడి, ఏఎం జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ లో ఏఎం రత్నం నిర్మించారు. ఈ చిత్రానికి రూ.250 కోట్లు వెచ్చించారు. ఇక ఈ చిత్రం 260 కోట్ల రూపాయల గ్రాస్ ను తిరిగి రాబట్టాల్సి ఉంది. ఇక ఇప్పటి వరకు 110 కోట్ల గ్రాస్ వసూలైనట్టు ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ప్రస్తుతం 2వ వారంలో వసూళ్లు రాబడుతోంది. రెండవ వారంలో ఎన్ని కోట్లు వసూళ్లు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X