OTT: థియేట‌ర్ల‌లో హిట్ - నెల‌లోపే ఓటీటీలోకి వ‌చ్చిన యాక్ష‌న్ మూవీ

ఓటీటీలోకి సైలెంటుగా పవన్ కల్యాణ్ ఓజీ యాక్టర్ అర్జున్ దాస్ నటించిన యాక్షన్ చిత్రం పోర్ వచ్చేసింది. ఈ సినిమా ఈ ఏడాది మార్చి 1న రిలీజ్ అయింది. ఇక నెల కాకముందే ఓటీటీలో సందడి చేస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి బిజోయ్ నంబియార్ దర్శకత్వం వహించారు. అసలు ఈ సినిమా కథేంటి.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనే వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.

తమిళ నటుడు అర్జున్ దాస్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ యంగ్ హీరో... లోకేష్ క‌న‌క‌రాజ్ సినిమాతో కోలీవుడ్ లో బాగా పాపుల‌ర్ అయ్యాడు. లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన మాస్టార్, విక్రమ్, ఖైదీ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత హీరోగా పలు సినిమాలు కూడా చేశాడు అర్జున్ దాస్. ఆయన గోంతు వింటే మాత్రం నిజంగా లయన్ మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆయన వాయిస్ కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది.

Pawan Kalyan OG Actor Arjun Das Action Movie POR Streaming Now on Netflix OTT Full Details Here

ప్రస్తుతం అర్జున్ దాస్.. పవన్ కల్యాణ్ సుజిత్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ఓజీ. ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అర్జున్ దాస్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి అర్జున్ దాస్ పోస్టర్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక స్టార్ హీరోల సినిమాల్లో కీల‌క పాత్ర‌లు చేస్తోన్న అర్జున్ దాస్ మ‌రోవైపు సోలో హీరోగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.అర్జున్ హీరోగా న‌టించిన త‌మిళ తాజా చిత్రం పోర్.

మార్చి 1న ఈ సినిమా థియేటర్లోకి వచ్చింది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు బిజోయ్ నంబియార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించగా.. ఈ సినిమాను త‌మిళంతో పాటు హిందీలో ఏక‌కాలంలో రూపొందించారు. త‌మిళ వెర్ష‌న్‌లో అర్జున్ దాస్‌, కాళిదాస్ జ‌య‌రామ్ కీల‌క పాత్ర‌ల్లో నటించగా... హిందీ వెర్ష‌న్‌లో హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణే, ఎహాన్ భ‌ట్ కీలక పాత్రలు పోషించారు. హిందీలో డంగే పేరుతో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చి పర్వాలేదనిపించింది.

మార్చి 1న థియేట‌ర్ల‌లో పోర్ మూవీ రిలీజ్ కాగా.. మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఓటీటీ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండా సైలెంట్‌గా పోర్ మూవీని ఓటీటీలో విడుదల చేశారు. త‌మిళంతో పాటు హిందీలో పోర్ సినిమా అందుబాటులో ఉంది. త్వరలోనే మరిన్ని భాషల్లో తీసుకొచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా సబ్ టైటిల్స్ తో తెలుగు ఆడియెన్స్ చూసి ఎంజాయ్ చేయవచ్చు.

Pawan Kalyan OG Actor Arjun Das Action Movie POR Streaming Now on Netflix OTT Full Details Here

ఇక ఈ సినిమా విషయానికి వస్తే... కాలేజీ స్టూడెంట్స్ ల‌వ్ స్టోరీస్‌, గొడ‌వ‌లు, స‌ర‌దాల‌ కాన్సెప్టుతో ఈ సినిమా సాగనుంది. సీనియ‌ర్ స్టూడెంట్ ప్ర‌భుతో(అర్జున్ దాస్‌) ఫ్రెష‌ర్ యువ (కాళిదాస్ జ‌య‌రామ్‌) గొడ‌వ పడగా... ఎలాంటి ప‌రిణామాల‌కు దారితీసిందనేది కథ. అర్జున్ దాస్ నటనకు ప్రశంసలు దక్కగా.. తమిళంలో సూపర్ హిట్టుగా నిలిచింది. ఈ వీకెండ్ యాక్షన్ మూవీ చూడాలనుకుంటే ఇది బెస్ట్ ఛాయిస్. చూసి ఎంజాయ్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X