Unstoppable 2: బాలకృష్ణకు వరుసగా ఫ్లాపులు, నాగబాబు షాకింగ్ రియాక్షన్.. అసలు విషయం చెప్పిన పవన్ కల్యాణ్!
నందమూరి నటసింహం హోస్ట్ గా అదరగొడుతున్న టాక్ షో అన్ స్టాపబుల్. టాక్ షోలన్నింటికి బాప్ షోగా పేరొందింది ఈ షో. ఎంతో విజయం సాధించిన ఈ అన్ స్టాపబుల్ రెండో సీజన్ ఫిబ్రవరి 9తో ముగిసింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ప్రారంభం అయిన ఈ రెండో సీజన్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో పూర్తి సెలబ్రేషన్ లా కంప్లీట్ చేసుకుంది. అన్ స్టాపబుల్ రెండో సీజన్ పవర్ ఫినాలే ఎపిసోడ్ లో పవన్ కల్యాణ్ ను ఎన్నో ప్రశ్నలు అడిగి.. ఎంతో ఆసక్తికర విషయాలను బయటకు లాగాడు నందమూరి బాలయ్య బాబు. ఈ క్రమంలోనే ఒక సమంయలో బాలకృష్ణ సినిమాలు వరుసగా ఫ్లాపులు కాగా వాటిపై నాగబాబు చేసిన షాకింగ్ కామెంట్స్ ను పవన్ కల్యాణ్ బయటపెట్టారు.

కథ చెబుతుంటే నిద్ర పోవడం..
బాలకృష్ణ అన్ స్టాపబుల్ రెండో సీజన్ పవర్ ఫినాలే ఎపిసోడ్ ను రెండు భాగాలుగా విభజించిన విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గెస్టుగా వచ్చిన ఎపిసోడ్ మొదటి పార్టును ఫిబ్రవరి 2న రాత్రి 9 గంటలకు ప్రసారం చేయగా.. దానికి బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ ఎపిసోడ్ లో పవన్ కల్యాణ్, బాలకృష్ణ మొదటి సారి ఎక్కడ.. ఎప్పుడు.. ఎలా కలుసుకున్నారో తెలిపారు. మూడు పెళ్లిళ్లు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి ఎలా వచ్చారు. అసలు సుస్వాగతం మూవీ తర్వాత సినిమాలు ఎందుకు చేయనని అన్నారు, పవన్ ఫామ్ హౌజ్, త్రివిక్రమ్ కథ చెప్పడం, నిద్ర పోవడం గురించి పలు ఆసక్తికర అంశాలను చర్చించారు.

నా గురించి ఏమనుకుంటున్నావ్..
తాజాగా పవన్ కల్యాణ్ పవర్ ఫినాలే ఎపిసోడ్ రెండో పార్టును గురువారం ఫిబ్రవరి 9న విడుదల చేశారు. ఈ పార్టులో కూడా అనేక ఆసక్తికర, రాజకీయ అంశాలను చర్చించారు బాలయ్య, పవన్ కల్యాణ్. ఇక ఎపిసోడ్ ఎండింగ్ లో పవన్ కల్యాణ్ ఒక చివరి ప్రశ్న వేశారు బాలయ్య బాబు. "లాస్ట్ క్వశ్చన్.. దగ్గరికి వచ్చి చెప్పాలి. ఇప్పుడు ఈ షోకి రాకముందు.. నా గురించి ఏమనుకున్నావ్.. షో అయిపోయాక.. ఇప్పుడు ఏమనుకుంటున్నావ్" అని అడిగారు బాలకృష్ణ.

మంచో చెడో గుండెల్లో నుంచి..
"బాలకృష్ణ గారు అంటే.. బయట ఏమనుకుంటారో నాకు తెలియదు కానీ.. ఆయన ముక్కుసూటి వ్యక్తిత్వం. కల్మషం లేని ఆలోచన విధానం. మంచో చెడో గుండెల్లో నుంచి మాటలు వచ్చేస్తాయ్.. బయట ఒకటి.. లోపల మరొకటి కాకుండా ఉంటాయి. ఈ షోకి రాకముందు ఎలాంటి భావన ఉందో.. కలిసిన తర్వాత కూడా నాకు అదే భావన ఉంది. అది కాకుండా అదనంగా.. ఆయన వ్యక్తిత్వం వెనుక ఒక ప్రేమ మూర్తి ఉన్నారు. ఒక మంచితనం ఉంది" అని పవన్ కల్యాణ్ తెలిపారు.

బాలకృష్ణ సినిమాలు ఆడనప్పుడు..
ఇంకా పవన్ కొనసాగిస్తూ "సినిమా అనేది ఒక ఆనందాన్ని ఆహ్లదకరమైనది. ఇప్పుడు ఎవరు యాక్ట్ చేసిన సరే.. తాము అందరి సినిమాలు బాగుండాలని కోరుకుంటాం. ఈ సందర్భంగా మా ఇంట్లో జరిగిన ఒక సంఘటన తెలియజేస్తాను. ఇది ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. ఒక సమయంలో.. ఒక సీజన్ లో మీ (బాలకృష్ణ) సినిమాలు సరిగ్గా ఆడనప్పుడు మా ఇంట్లో మేం ఏం కోరుకున్నామంటే.. బాలకృష్ణ గారి సినిమా మంచి హిట్లు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం" అని పేర్కొన్నారు.

నటుడి కష్టాలు, జయాలు, అపజయాలు..
"నాగబాబుతో సహా మేము అందరం మీ సినిమాలు హిట్లు కొట్టాలని కోరుకున్నాం. ఈ విషయం మా నాగబాబు ఎత్తాడు. ఆయన సినిమాలు బాగా హిట్ అవ్వాల్రా అని చెప్పేసి. మేము ఎందుకు అలా ఆలోచిస్తామంటే. మేమంతా నటన నుంచి వచ్చిన వాళ్లం. ఆ వాతావరణంలో పెరిగినవాళ్లం కాబట్టి.. సాటి నటుడి తాలుకూ కష్టాలు, జయాలు, అపజయాలు అన్నింటిని మేము సమానంగా తీసుకుగోలం. మాకు లోపల పోటీతత్వం ఉంటుంది తప్పా.. మా ఎవ్వరి మధ్యలో ఈర్శ్య ద్వేశాలు ఉండవు" అని పవన్ కల్యాణ్ అన్నారు.

వాటికి సరితూగే వ్యక్తి బాలకృష్ణ...
"చిత్రపరిశ్రమలో రాజకీయ పరంగా విభిన్నమైన ఆలోచన విధానాలు ఉండొచ్చు. మేము ఒకసారి వేరు అవ్వొచ్చు. కలవచ్చు, కలవకపోవచ్చు. ఏదైనా అవ్వొచ్చు కానీ, కనీసం సంస్కారం ఏమిటంటే.. కనీసం ఇలా కూర్చుని మనసు విప్పి మాట్లాడుకుని ఒక షోకి వచ్చి ఆనందంగా మాట్లాడుకుంటూ అందరికి సంతోషాన్ని పంచే వేదికలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అటువంటి వేదకకు సరైనా.. సరితూగే వ్యక్తి బాలకృష్ణ గారు. ఆయన ఘన విజయాలు సాధించాలని, రాజకీయాల్లో ఉన్నత పదవులు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను" అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











