OTTలో అదరగొడుతున్న తెలుగు సినిమా... నేషనల్ వైడ్‍గా నంబర్ 1 స్థానంలో..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన మేనల్లుడు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ తో కలిసి నటించిన చిత్రం బ్రో. ఇక ఈ చిత్రం థియేటర్లలో జులై 28వ తేదీన రిలీజ్ అయి... మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది. రిలీజ్ అయి నెల కాకముందే... ఓటీటీలోకి వచ్చేసింది. ఆగస్టు 25న ఓటీటీలో రిలీజ్ కాగా... సూపర్ రెస్పాన్స్ తో ఈ సినిమా దూసుకుపోతుంది. ఇండియాలో టాప్ ట్రెండింగ్ మూవీల జాబితాలో ఈ సినిమా ప్రస్తుతం అగ్రస్థానంలోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే....
పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రం బ్రో. ఇక ఈ సినిమా జూలై 28న థియేటర్లలోకి వచ్చింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి మిక్స్ డ్ టాక్ వచ్చిన ఈ సినిమాకు రూ.110కోట్లకుపైగా కలెక్షన్లను సాధించింది. పవర్ స్టార్ అభిమానులకు బ్రో మూవీ తెగ నచ్చేసిందనే చెప్పాలి. వింటేజ్ పవన్ ను చూసి ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. కాగా... బ్రో సినిమా ఇటీవలే ఆగస్టు 25వ తేదీన ఓటీటీలోకి వచ్చింది.

నెట్‍ఫ్లిక్స్ ప్లాట్ ఫామ్ వేదికగా... పవన్ బ్రో సినిమా విడుదల అయింది. ఇప్పుడు ఓటీటీలోనూ ఈ చిత్రం దూసుకుపోతోంది. బ్రో సినిమాకు నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో నేషనల్ వైడ్‍గా ఆదరణ వస్తోంది. దీంతో ఇండియాలో టాప్ ట్రెండింగ్ మూవీల జాబితాలో ఈ సినిమా ప్రస్తుతం టాప్ వన్ లో ఉంది.

నెట్ ఫ్లిక్స్‌లో నేషనల్ వైడ్ గా ప్రస్తుతం (ఆగస్టు 27) టాప్ ట్రెండింగ్ మూవీగా బ్రో నిలిచింది. నెట్ ఫ్లిక్స్ లో తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ బ్రో చిత్రం స్ట్రీమింగ్ కు వచ్చేసింది. దేశవ్యాప్తంగా ఎక్కువ మంది ఈ సినిమాను చూస్తుండడానికి ఇది కూడా ఓ కారణం ఉందని తెలుస్తోంది. మొత్తంగా బ్రో సినిమా ఓటీటీలోనూ అదరగొడుతోంది.
బ్రో చిత్రానికి తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహించారు. తమిళంలో తెరక్కించిన వినోదయ సిత్తంకు రీమేక్ గా తెలుగులోనూ ఆయనే బ్రో సినిమాకు దర్శకత్వం వహించారు. మాతృకకు కొన్ని మార్పులు చేసిన పవన్ కల్యాణ్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. ఇక ఈ సినిమాలోని శ్యాంబాబు క్యారెక్టర్ పై వివాదం కూడా తలెత్తింది.

ఇక బ్రో సినిమాలో పవన్ కల్యాణ్ దేవుడి పాత్రలో నటించారు. థమన్ సంగీతం అందించారు. సాయి ధరమ్ తేజ్ సరసన ఈ మూవీలో కేతిక శర్మ నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ సినిమా నిర్మించారు. రోహిణి, ప్రియాప్రకాశ్ వారియర్, సుబ్బరాజు, వెన్నెల కిశోర్ కీలకపాత్రలు పోషించారు.


Click it and Unblock the Notifications











