NBK Vs PSPK ఆమె లేనప్పుడు థాయిలాండ్.. అన్నయ్య గన్ తీసుకుని, పవన్ కల్యాణ్ షాకింగ్ గా!

నందమూరి నటసింహం హోస్ట్ గా అదరగొడుతున్న టాక్ షో అన్ స్టాపబుల్. ప్రస్తుతం ఈ టాక్ షో రెండో సీజన్ ఎంతో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ప్రారంభం అయిన ఈ రెండో సీజన్ లో ఎంతో మంది స్టార్స్ వచ్చి సందడి చేశారు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వచ్చిన ఎపిసోడ్ సెన్సేషన్ అయింది. ప్రభాస్ ఎపిసోడ్ తో ఆహా ఓటీటీ సర్వర్ హ్యాంగ్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ రెండో సీజన్ ను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ముగించనున్నారని టాక్. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.

 ఫైనల్ ఎపిసోడ్ గా..

ఫైనల్ ఎపిసోడ్ గా..

ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ వేదిక ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ రోజురోజుకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ అందుకుంటోంది. గతంలో ఎప్పుడు లేనివిధంగా నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా కనిపించిన విధానం ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ అన్ స్టాపబుల్ షో రెండో సీజన్ చివరి ఎపిసోడ్ కు స్పెషల్ గెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రానున్న విషయం తెలిసిందే.

 ఫిబ్రవరి 3న పూర్తి ఎపిసోడ్..

ఫిబ్రవరి 3న పూర్తి ఎపిసోడ్..

ఇక తాజాగా పవన్ కల్యాణ్ ఎపిసోడ్ ను కూడా ప్రభాస్ ఎపిసోడ్ లాగే రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 3న పవన్ కల్యాణ్ అన్ స్టాపబుల్ సీజన్ 2 ఎపిసోడ్ మొదటి పార్టును స్ట్రీమింగ్ చేయనున్నారు. దీనికి సంబంధించి విడుదల చేసిన ప్రోమోలోకి వెళితే.. పవన్ కల్యాణ్ స్టేజీపైకి రాగానే.. ఈశ్వరా.. పవనేశ్వరా అని బండ్ల గణేష్ చెప్పిన డైలాగ్ ను బాలకృష్ణ చెప్పారు. నేను మీకు తెలుసు.. నా స్థానం మీ మనసు అని బాలకృష్ణ డైలాగ్ ను పవన్ కల్యాణ్ చెప్పారు.

 కుర్రాడిలా ఉన్నా కదా..

కుర్రాడిలా ఉన్నా కదా..

గుడుంబా శంకర్ మూవీలో ప్యాంట్ మీద ప్యాంట్ వేశావ్. అలా ప్యాంట్ వేస్తే పాతికేళ్లు తగ్గావ్ తెలుసా అని బాలకృష్ణ అన్నారు. మనం ఫస్ట్ టైమ్ ఎప్పుడు కలిశామో గుర్తుందా అమ్మా నీకు అని అడిగిన బాలకృష్ణ ఒక ఫొటో చూపించారు. అది గోకులంలో సీత సినిమా సమయంలోని ఫొటోల ఉంది. అది చూపిస్తూ నేను కుర్రాడిలా ఉన్నా కదా అని బాలయ్య అంటే.. ఇప్పటికీ అలాగే ఉన్నారు అని పవన్ చెప్పారు.

ఒక్కన్నే ఇంట్లో దొరికిపోయాను..

ఒక్కన్నే ఇంట్లో దొరికిపోయాను..

ఒకసారి మీ దగ్గరికి త్రివిక్రమ్ కథ చెప్పేందుకు వచ్చినప్పుడు అని ఏదో చెప్పబోతు.. మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కదా అని అడిగారు బాలయ్య. అందుకు ఫ్రెండ్స్ అవ్వాల్సి వచ్చింది అని పవన్ చెప్పారు. బ్రదర్ సరదాగా సాయంత్రం పూట అని బాలకృష్ణ అంటుంటే.. నాలుగు తర్వాతనా.. ఆరు తర్వాతనా అండి అని పవన్ నవ్వించారు. రామ్ చరణ్ నీకు ఎలా క్లోజ్ అన్నదానికి నాకు చిన్నప్పుడు డ్యూటీ ఉండేది అని పవన్ తెలిపారు. నాగబాబు కూడా ఉన్నాడు కదా మధ్యలో అని బాలయ్య అంటే.. ఆయన నిర్మాతగా ఉండేవాడు కాబట్టి నేను ఒక్కన్నే ఇంట్లో దొరికిపోయాను. రామ్ చరణ్ తో క్లోజ్ అవ్వాల్సి వచ్చింది అని పవన్ కల్యాణ్ తెలిపారు.

 ఆమె లేనప్పుడు థాయిలాండ్..

ఆమె లేనప్పుడు థాయిలాండ్..

అనంతరం రామ్ చరణ్ కు కాల్ చేసిన బాలయ్య బాబు.. ఏమయ్యా ఫిట్టింగ్ మాస్టారు.. నేను ఒక్క విషయం అడగటానికి ఫోన్ చేశాను. ప్రభాస్ గురించి చెప్పవయ్యా అంటే.. నీ గుడ్ న్యూస్ మింగేసి.. అతని గుడ్ న్యూస్ చెప్పావ్ అని అన్నారు. తర్వాత చెర్రీ చెప్పినదానికి.. ఐదేళ్ల పిల్లాడిని చంకలో పెట్టుకుని ఆడటం ఏంటమ్మా అని పవన్ ను అడిగారు బాలయ్య. అదంతా థాయిలాండ్.. ఆమె లేనప్పుడు అని బాలయ్య నవ్వించారు.

ఇంటికెళ్లాక బడితపూజ..

ఇంటికెళ్లాక బడితపూజ..

ఇప్పుడు సాటి హీరోగా అడగట్లేదు.. మీకు మీ అమ్మ అంటే భయమా.. మీ ఆవిడ అంటే భయమా అని బాలయ్య అడిగారు. అప్పుడే సాయి ధరమ్ తేజ్ పంచకట్టుతో ఎంట్రీ ఇచ్చాడు. ఏంటీ పెళ్లి చూపులకు వచ్చావా అని కౌంటర్ వేశారు బాలయ్య. అనంతరం హరర్ సినిమాలకు అమ్మాయిలకు తేడా లేదండి అని సాయి ధరమ్ తేజ్ అన్నారు. తర్వాత ఏదో విషయమై ఇంటికెళ్లాక బడితపూజేనా అని పవన్ ని బాలయ్య అడిగితే ఉంటుందండి కొద్దిగా అని చెప్పారు.

పిస్టల్ తీసుకుని..

పవన్ కల్యాణ్ గురించి చెబుతూ.. ఆఖరికి అమ్మాయిలను ఎలా గౌరవించాలో కూడా చెప్పారు అని సాయి ధరమ్ తేజ్ చెప్పాడు. సాయి ధరమ్ తేజ్ వెళ్లాక.. పెళ్లిళ్ల గొడవ ఏంటీ భయ్యా అని బాలయ్య అడిగారు. వాళ్లు బాధపడతారేమో అని చెప్పి.. నా విజ్ఞతో.. నా సంస్కారమో మాట్లాడానివ్వకుండా ఆపేస్తుంది అని పవన్ కల్యాణ్ తెలిపారు. ఇంత మానసిక సంఘర్షణకు గురైన పవన్ కల్యాణ్ పవర్ స్టార్ ఎలా అయ్యారు అన్నదానికి.. అన్నయ్య రూమ్ లోకి వెళ్లి పిస్టల్ తీసుకుని అంటూ హెడ్ వైపు చేతి చూపించారు పవన్. ఇలా సస్పెన్సింగ్ గా ప్రోమోను ముగించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X