BRO OTT: పాన్ ఇండియా రేంజ్‌కు పవన్.. బ్రో నుంచి బిగ్ సర్‌ప్రైజ్.. స్ట్రీమింగ్ డేట్ ప్రకటన
టాలీవుడ్‌లో వేగంగా సినిమాల మీద సినిమాలు చేస్తూ రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతోన్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇలా రీఎంట్రీ ఇచ్చిన తర్వాతనే 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్' వంటి చిత్రాలతో అలరించిన అతడు.. ఇటీవలే 'బ్రో (BRO)' అనే చిత్రంతో వచ్చాడు. అయితే, దీనికి ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన మాత్రం లభించలేదు. ఫలితంగా డల్ కలెక్షన్లతోనే ఇది రన్‌ను ముగించేసింది. ఈ నేపథ్యంలో 'బ్రో (BRO)' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌పై ప్రముఖ సంస్థ అధికారిక ప్రకటన చేసింది. ఆ వివరాలు మీకోసమే!
మెగా హీరోల కాంబోలో 'బ్రో' : మెగా హీరోలు పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమానే 'బ్రో (BRO)'. సముద్రఖని తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించింది. ఇందులో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా చేశారు. దీనికి థమన్ సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రం 'వినోదయ సీతమ్' అనే తమిళ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది.

అలాంటి టాక్.. కోట్ల నష్టాలు : క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'బ్రో (BRO)' మూవీకి మొదటి రోజే మంచి టాక్ వచ్చింది. అయినప్పటికీ దీనికి ఓపెనింగ్ భారీ స్థాయిలో రాలేదు. దీనికితోడు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ చిత్రం అంతగా రాణించలేకపోయింది. దీంతో ఫుల్ రన్‌లో ఈ సినిమాకు రూ. 67.40 కోట్లు వచ్చాయి. ఫలితంగా రూ. 31.10 కోట్లు మేర నష్టాలతో ఈ మూవీ రన్‌ను ముగించింది.

భారీ ధరకు డిజిటల్ రైట్స్ : పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన 'బ్రో (BRO)' మూవీపై ఆరంభం నుంచీ అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. ఫలితంగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఈ రైట్స్ కోసం చాలా సంస్థలు చర్చలు కూడా జరిపాయి. కానీ, ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ఓ ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసింది.

నెల కాకుండానే ఓటీటీలో : సోషియో ఫాంటసీ జోనర్‌లో రూపొందిన 'బ్రో (BRO)' మూవీని థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారని టాక్ వచ్చింది. కానీ, ఇది ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో దీన్ని ఆగస్టు 25 నుంచే ఓటీటీలో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. అంటే 'బ్రో' నెల కాకముందే రాబోతుందన్న మాట.

స్టార్ హీరో మూవీ త్వరగానే : ఓటీటీల హవా పెరిగిన తర్వాత చాలా చిత్రాలు నెల కంటే ముందుగానే స్ట్రీమింగ్ అవుతున్నాయి. కానీ, స్టార్ హీరోల సినిమాలు కనీసం నెల రోజుల గ్యాప్‌తో వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ నటించిన 'బ్రో (BRO)' మూవీ నెలలోపే ఓటీటీలోకి రాబోతుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీంతో ఇప్పుడీ అంశం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.
పాన్ ఇండియా రేంజ్‌లోనే : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలయికలో రూపొందిన 'బ్రో (BRO)' మూవీ ఆగస్టు 25 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇది తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి రాబోతుంది. తద్వారా పవన్ కల్యాణ్ సినిమా పాన్ ఇండియా రేంజ్‌కు వెళ్లినట్లు అయింది.


Click it and Unblock the Notifications











