BRO OTT: నెల కాకముందే ఓటీటీలోకి బ్రో.. పవన్ కెరీర్‌లోనే తొలిసారి.. ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్ కూడా!

తెలుగు చిత్ర పరిశ్రమలో వేగంగా సినిమాలు చేసే హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో బడా హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకడు. గతంలో కాస్త నెమ్మదిగానే మూవీలు చేసిన ఈ మెగా హీరో.. ఈ మధ్య కాలంలో మాత్రం వరుస పెట్టి ప్రాజెక్టులను చేసుకుంటూ వస్తున్నాడు.

ఇలా రీఎంట్రీలో ఇప్పటికే పలు చిత్రాలతో ప్రేక్షకులను, సినీ ప్రియులను అలరించాడు. ఈ క్రమంలోనే ఇటీవలే 'బ్రో (BRO)' అనే చిత్రంతో వచ్చాడు. థియేటర్లలో పెద్దగా సందడి చేయలేకపోయిన ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌పై న్యూస్ లీకైంది. ఆ పూర్తి వివరాలు మీకోసమే!

Pawan Kalyan Starrer BRO Movie Streaming On Netflix From August 25th

మల్టీస్టారర్‌గా వచ్చిన 'బ్రో': మెగా ఫ్యామిలీ హీరోలు పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన సినిమానే 'బ్రో (BRO)'. సముద్రఖని తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించింది. ఇందులో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా చేశారు. దీనికి థమన్ సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రం 'వినోదయ సీతమ్' అనే తమిళ సినిమాకు రీమేక్‌గా రూపొందింది.

Pawan Kalyan Starrer BRO Movie Streaming On Netflix From August 25th

అలాంటి టాక్.. డల్ రన్‌తో: డివోషనల్ కాన్సెప్టుతో రూపొందిన 'బ్రో (BRO)' మూవీకి మొదటి రోజే మంచి టాక్ వచ్చింది. అయినప్పటికీ దీనికి ఓపెనింగ్ భారీ స్థాయిలో రాలేదు. దీనికితోడు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ చిత్రం అంతగా రాణించలేకపోయింది. ఆ తర్వాత కూడా రెస్పాన్స్‌ను అంతగా అందుకోలేదు. ఇలా ఈ సినిమా 2 వారాల్లోనే రన్‌ను కంప్లీట్ చేసుకోవాల్సి వచ్చింది.

Pawan Kalyan Starrer BRO Movie Streaming On Netflix From August 25th

బ్రోకు అన్ని కోట్ల నష్టాలు: 'బ్రో (BRO)' మూవీపై అంచనాలు భారీగా ఉండడంతో దీనికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 97.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 98.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఫుల్ రన్‌లో పవన్ సినిమాకు రూ. 67.40 కోట్లు వచ్చాయి. అంటే.. ఈ సినిమాకు మొత్తంగా రూ. 31.10 కోట్లు మేర నష్టాలు వచ్చినట్లు చెప్పుకోవాలి.

Pawan Kalyan Starrer BRO Movie Streaming On Netflix From August 25th

ఓటీటీ రైట్స్ బడా సంస్థకే: మెగా హీరోలు పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో మల్టీస్టారర్‌గా రూపొందిన 'బ్రో (BRO)' మూవీపై నెలకొన్న అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఈ రైట్స్ కోసం చాలా సంస్థలు పోటీలో నిలిచాయి. కానీ, ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసింది.

Pawan Kalyan Starrer BRO Movie Streaming On Netflix From August 25th

నెలలోనే ఓటీటీలోకి బ్రో: డివోషనల్ కాన్సెప్టుతో సోషియో ఫాంటసీ జోనర్‌లో వచ్చిన 'బ్రో (BRO)' మూవీని థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, తాజా సమాచారం ప్రకారం.. ఇది ఆగస్టు 25 నుంచే ఓటీటీలో అందుబాటులోకి రాబోతుందని తెలిసింది. అంటే జూలై 28న విడుదలైన 'బ్రో' నెల కాకముందే స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోతుంది.

Pawan Kalyan Starrer BRO Movie Streaming On Netflix From August 25th

పవన్ కెరీర్‌లోనే తొలిసారి: పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన 'బ్రో (BRO)' మూవీ నెల రోజులు కూడా కాకముందే ఓటీటీలోకి రాబోతుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అతడి కెరీర్‌లోనే త్వరగా స్ట్రీమింగ్‌కు వచ్చిన చిత్రంగా ఇది నిలవబోతుంది. ఇక, ఈ చిత్రంలో సెన్సార్ కట్ చేసిన సీన్స్, బీప్ చేసిన డైలాగులను కూడా యాడ్ చేసి ప్రసారం చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X