BRO OTT: ఫేమస్ ఓటీటీలో బ్రో మూవీ.. స్ట్రీమింగ్ డేట్ లీక్.. పవన్ ఫ్యాన్స్‌‌కు రెండు పండుగలు

కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అవుతోన్న చిత్రాల్లో 'బ్రో (BRO)' ఒకటి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ఈ చిత్రం విడుదలకు ముందే ఎన్నో అంచనాలను ఏర్పరచుకుంది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం నేడే (జూలై 28) ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. దీనికి అన్ని ఏరియాల్లో మంచి స్పందన కూడా లభిస్తోంది. ఈ నేపథ్యంలో 'బ్రో (BRO)' మూవీ ఓటీటీ డీల్, స్ట్రీమింగ్ డేట్ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. ఆ సంగతులేంటో మీరు కూడా చూసేయండి మరి!

మెగా కాంబోలో 'బ్రో (BRO)':మెగా ఫ్యామిలీ హీరోలు పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన సినిమానే 'బ్రో (BRO)'. సముద్రఖని తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించింది. ఇందులో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా చేశారు. దీనికి థమన్ సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రం 'వినోదయ సీతమ్' అనే తమిళ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది.

Pawan Kalyan Starrer BRO Movie Streaming On Netflix From September 2nd

గ్రాండ్ రిలీజ్.. సందడిగానే:పవన్ కల్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో రూపొందిన 'బ్రో (BRO)' మూవీ ఆరంభంలోనే భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకుంది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మెగా మేనియా నెలకొంది. ముఖ్యంగా థియేటర్లు అన్నీ ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి.

అలాంటి టాక్... ఓపెనింగ్స్:'బ్రో (BRO)' మూవీకి అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ వచ్చింది. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపుగా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా భారీ స్థాయిలో దక్కుతోంది. దీంతో ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా అత్యధిక ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Pawan Kalyan Starrer BRO Movie Streaming On Netflix From September 2nd

ఓటీటీ డీల్ వివరాలు లీక్:పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో మెగా మల్టీస్టారర్‌గా రూపొందిన 'బ్రో (BRO)' మూవీపై నెలకొన్న అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు ఇప్పటికే ఓ న్యూస్ బయటకు వచ్చేసింది.

Pawan Kalyan Starrer BRO Movie Streaming On Netflix From September 2nd

నెల రోజుల తర్వాతే రిలీజ్:డివోషనల్ కాన్సెప్టుతో సోషియో ఫాంటసీ జోనర్‌లో వచ్చిన 'బ్రో (BRO)' మూవీని థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని సమాచారం. అంటే జూలై 28న విడుదలైన 'బ్రో (BRO)' ఆగస్టు చివరి వారంలో కానీ, సెప్టెంబర్ మొదటి వారంలో కానీ స్ట్రీమింగ్‌కు వస్తుందనే టాక్ ఫిలిం నగర్‌ సమాచారం.

Pawan Kalyan Starrer BRO Movie Streaming On Netflix From September 2nd

ఆరోజే.. రెండు పండుగలు:'బ్రో (BRO)' ఓటీటీ స్ట్రీమింగ్ గురించి తాజాగా ఓ న్యూస్ లీకైంది. దీని ప్రకారం.. ఈ సినిమాను సెప్టెంబర్ 2వ తేదీనే నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతున్నారట. దీనికి కారణం ఆరోజే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు ఉండడమే అని తెలిసింది. ఇదే నిజం అయితే మాత్రం మెగా అభిమానులకు ఒకే రోజు రెండు పండుగలు వస్తాయని చెప్పుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X