బడా సంస్థ చేతికి హరిహర వీరమల్లు.. పవన్ మూవీ ఓటీటీ వివరాలు ఇవే!

టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు చాలా మందే ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే ప్రత్యేకంగా నిలుస్తూ దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకడు. సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో హవాను చూపిస్తోన్న అతడు.. ఇప్పుడు వరుస సినిమాలతో సత్తా చాటుతోన్నాడు. ఇలా ప్రస్తుతం పవన్ మూడు నాలుగు మూవీలు చేస్తున్నాడు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం నటిస్తోన్న సినిమాల్లో 'హరిహర వీరమల్లు' ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న ఈ మూవీ భారీ బడ్జెట్‌తో రాబోతుంది. ఈ చిత్రాన్ని మొగల్ చక్రవర్తుల కాలం నాటి కథతో తీస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే దీన్ని తెరకెక్కిస్తున్నారు.

Pawan Kalyan Starrer Harihara Veeramallu Movie Digital Deal Closed

భారీ స్థాయిలో రూపొందుతోన్న 'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే మొదలైంది. కానీ, అనివార్య కారణాల వల్ల షూటింగ్‌కు చాలా బ్రేకులు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ ఏపీ ఎలెక్షన్ల‌తో బిజీగా ఉండడంతో షూట్‌ను వాయిదా వేసేశారు. దీంతో ఈ సినిమా ఆగిపోయిందన్న టాక్ వచ్చింది. కానీ, చిత్ర యూనిట్ ఈ వార్తలకు పుల్‌స్టాప్ వేసేసింది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'హరిహర వీరమల్లు' షూటింగ్‌కు బ్రేక్ పడడంతో చిత్ర యూనిట్ బిజినెస్ కార్యక్రమాలపై ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే ఇప్పటికే థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కుల కోసం అమ్మకాలు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ఓటీటీ డీల్ గురించి అప్‌డేట్ వచ్చేసింది.

Pawan Kalyan Starrer Harihara Veeramallu Movie Digital Deal Closed

హై రేంజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'హరిహర వీరమల్లు' మూవీకి సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని సదరు సంస్థ తాజాగా అధికారికంగా వెల్లడించింది. అంతేకాదు, థియేటర్లలో విడుదలైన తర్వాత స్ట్రీమింగ్ చేస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం సదరు సంస్థ భారీ మొత్తాన్ని నిర్మాతలకు ముట్టజెప్పినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా.. 'హరిహర వీరమల్లు' సినిమా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోంది. ఇందులో నిధి అగర్వాల్ కీలక పాత్రను చేస్తోంది. బాబీ డియోల్ ఇందులో విలన్‌గా చేస్తున్నాడు. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X