Unstoppable 2: పవన్ దెబ్బకు యూట్యూబ్ షేక్, ట్రెండింగ్ లో ప్రోమో.. 3 పెళ్లిళ్ల ముచ్చట లాగడంతో!
ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ వేదిక ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ రోజురోజుకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ అందుకుంటోంది. గతంలో ఎప్పుడు లేనివిధంగా నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా కనిపించిన విధానం ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే రెండో సీజన్ చివరి ఎపిసోడ్ ను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ముగించనున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తరహాలోనే ఈ ఎపిసోడ్ ను కూడా రెండు భాగాలుగా విభజించారు. అందులో మొదటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను శుక్రవారం విడుదల చేశారు. ఇప్పుడు ఆ ప్రోమో యూట్యూబ్ లో ట్రెండ్ క్రియేట్ చేస్తుంది.

రెండు భాగాలుగా పవర్ స్టార్ ఎపిసోడ్..
నందమూరి నటసింహం బాలయ్య బాబు హోస్ట్ గా అదరగొడుతున్న టాక్ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే. సూపర్ సక్సెస్ ఫుల్ గా సాగిన ఈ టాక్ షో రెండో సీజన్ కూడా దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది. మొదటి సీజన్ కు మించిన రెస్పాన్స్ లభించిన ఈ రెండో సీజన్ ను ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా మారిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ముగించనున్నారు. ఇక పవన్ కల్యాణ్ కు సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ ఎప్పుడో పూర్తి కాగా దానిని రెండు పార్టులుగా టెలీక్యాస్ట్ చేయనున్నారు. పవన్ కల్యాణ్ ఎపిసోడ్ పార్టు 1 ప్రోమోను ఇటీవల శుక్రవారం విడుదల చేసిన విషయం తెలిసిందే.

22 గంటల్లో అన్ని లక్షలకుపైగా..
పవన్ కల్యాణ్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ మొదటి పార్టును ఫిబ్రవరి 3న స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే శుక్రవారం విడుదల చేసిన ఈ ఎపిసోడ్ మొదటి పార్టు ప్రోమో తెగ ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా యూట్యూబ్ ను షేక్ చేస్తూ టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఈ ప్రోమోలో బాలకృష్ణ కామెడీ, పవన్ కల్యాణ్ సమాధానాలతో సూపర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఫలితంగా అత్యధిక వ్యూస్ సాధిస్తోంది. ఈ ప్రోమో విడుదలైన 22 గంటల్లో ఇప్పటివరకు 33 లక్షలకుపైగా వ్యూస్ రాగా.. 2.6 లక్షల లైక్స్ వచ్చాయి. దీంతో ఈ ప్రోమో యూట్యూబ్ ట్రెండింగ్ జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇలా పవర్ కల్యాణ్ క్రేజ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
మాట్లానివ్వకుండా ఆపేస్తోంది..
పవన్ కల్యాణ్ ఎపిసోడ్ ప్రోమో ట్రెండింగ్ లో కొనసాగుతున్న విషయాన్ని ఆహా వీడియో అధికారికంగా సోషల్ మీడియాలో తెలిపింది. ఇదిలా ఉంటే ఆ ప్రోమోలో ప్రారంభంలో పవన్ కల్యాణ్ స్టేజీపైకి రాగానే.. ఈశ్వరా.. పవనేశ్వరా అని బండ్ల గణేష్ చెప్పిన డైలాగ్ ను బాలకృష్ణ చెప్పారు. నేను మీకు తెలుసు.. నా స్థానం మీ మనసు అని బాలకృష్ణ డైలాగ్ ను పవన్ కల్యాణ్ చెప్పారు. తర్వాత మూడు పెళ్లిళ్ల గొడవేంటీ అని డైరెక్ట్ గా అడిగేశారు బాలయ్య. అందుకు.. వాళ్లు బాధపడతారేమో అని చెప్పి.. నా విజ్ఞతో.. నా సంస్కారమో మాట్లాడానివ్వకుండా ఆపేస్తుంది అని పవన్ కల్యాణ్ తెలిపారు. ఇలా తదితర ప్రశ్నలకు ఆసక్తిగా సమాధానాలిచ్చారు పవన్ కల్యాణ్. దీంతో ఈ ప్రోమో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో దూసుకుపోతోంది.


Click it and Unblock the Notifications











