BRO: మేనల్లుడితో పవన్ పవర్ఫుల్ రికార్డ్.. భారీ ధరకు ఓటీటీ డీల్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటిస్తున్న సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ బ్రో... వినోదాయ సీతమ్ రీమేక్ గా రానుంది. ఇక పవర్ఫుల్ గా రెడీ అవుతున్న ఈ మూవీకి తాజాగా టైటిల్ ఫిక్స్ చేశారు. ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని దర్శకుడు సముద్రఖని ఆవిష్కరించారు.

టైమ్ ని ఈ మూవీలో లీడ్ రోల్ గా మార్చి పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ తో ప్రెజెంట్ చేస్తున్నారు. ఫాంటసీ లైన్ లో సోషల్ ఇష్యూకి రిలేట్ చేసి ప్రతి ఒక్కరి జీవితంలో టైమ్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఈ మూవీలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో తేజ్ కి జోడీగా ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ జోడీగా నటిస్తున్నారు. స్టార్ క్యాస్టింగ్ ని మూవీ కోసం సముద్రఖని ఎంపిక చేసుకున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.

Pawan kalyan upcoming movie bro movie OTT deal new record

జులై 28న ఈ మూవీ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా వచ్చిన బ్రో మోషన్ పోస్టర్ ద్వారా ఈ మూవీ ఒటీటీ పార్ట్నర్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో బ్రో మూవీ కోసం జీ స్టూడియోస్ కూడా టై అప్ అయ్యింది. ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ్ నుంచి చూస్తే అతని కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.

Pawan kalyan upcoming movie bro movie OTT deal new record

ఇక తమన్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తూ ఉండగా బ్రహ్మానందం, రోహిణి, తనికెళ్ళ భరణి, రాజా ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపిస్తున్నారు. రంగామార్తాండ తర్వాత బ్రహ్మానందం కనిపించబోయేది ఈ మూవీలోనే కావడం విశేషం. మరి అతని పాత్ర ఫన్ జోనర్ లో నడుస్తుందా లేదంటే సీరియస్ టచ్ ఉంటుందా అనేది చూడాలి. ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓజీ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షెడ్యూల్ తాజాగా హైదరాబాద్ లో తిరిగి ప్రారంభం అయ్యింది. ఈ నెల ఆఖరు వరకు ఈ షెడ్యూల్ కొనసాగే అవకాశం ఉందని టాక్. డివివి దానయ్య భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో ఈ మూవీని నిర్మిస్తూ ఉండటం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X