11 నెలల తర్వాత OTTలోకి పాయల్ రాజ్‌పుత్ సెల్ ఫోన్ స్టోరీ.. ఈ క్రేజీ థ్రిల్లర్ మూవీని ఎక్కడ చూడాలంటే?
ఓటీటీల హవా పెరుగుతుండడంతో.. పాత చిత్రాలను కూడా ఓటీటీల్లోకి తీసుకు వస్తూ క్యాష్ చేసుకుంటున్నారు చాలా మంది. టీవీలు చూసే వారి సంఖ్య తగ్గడం.. ఓటీటీలను వాడే వారి సంఖ్య పెరగడంతో అనేక పాత్ర చిత్రాలు కూడా ప్రస్తుతం ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం నాటి చిత్రాలను ఇప్పటికీ ఓటీటీల్లో అందుబాటులో ఉంచగా.. ఇప్పుడు మరో క్రేజీ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. 11 నెలల తర్వాత ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధం అయిన ఈ తెలుగు సినిమా ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుంది వంటి విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బేబీ సినిమాలో రెండో హీరోగా కనిపించిన విరాజ్ అశ్విన్, ఆర్ఎక్స్ 100 సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన పాయల్ రాజ్ పుత్ లు హీరోహీరోయిన్లుగా చేసిన క్రేజీ మూవీయే మాయా పేటిక. ఈ సినిమాలో వీరు మాత్రమే కాకుండా హీరో సునీల్, హిమజ, యాంకర్ శ్యామల, సిమ్రత్ కౌర్, పృథ్వీరాజ్, శ్రీనివాసరెడ్డి, రజత్ రాఘవలు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. రమేష్ రాపర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమాను మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్ నాథ్ బొమ్మిరెడ్డిలు నిర్మించారు. అలాగే గుణ బాలసుబ్రమణ్యం ఈ కామెడీ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ కు సంగీతం అందించారు.

అయితే గతేడాది జూన్ 30వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేశారు. కానీ అనుకున్న స్థాయిలో ఈ చిత్రం హిట్ కొట్టలేకపోయింది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ సెల్ ఫోన్ ను గిఫ్టుగా అందుకుంటుంది. అయితే ఆ తర్వాత ఈమె లైఫ్ ఎలా మారిపోయింది.. ముఖ్యంగా ఆమె వద్ద నుంచి కార్పోరేటర్ కన్నె కామేశ్వర్ రావు (30 ఇయర్స్ పృథ్వీ) జీవితాన్ని ఎలా నాశనం చేసింది? అలీ, ఆస్రా ప్రేమకు ఎలా అడ్డంకిగా మారింది? వాచ్‌మెన్ నారాయణను నక్లీస్ నారాయణగా ఎలా మార్చిందో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పలు సీన్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వాటి వల్లే అసలు ఈ సీన్లు ఏ సినిమాల్లోవి అని తెలుసుకుంటూ చాలా మంది సెర్చ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ల బాధను అర్థం చేసుకున్న మూవీ టీం ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేసింది. ముఖ్యంగా రేపే విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారమ్ అయిన ఈటీవీ విన్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది. మే 16వ తేదీ అంటే రేపటి నుంచే ఈటీవీ విన్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఈక్రేజీ మూవీ అంతా చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











