Mangalavaaram: ఓటీటీలోకి వచ్చేసిన పాయల్ స్పైసీ మూవీ.. ఆ సీన్స్ కూడా పెట్టారుగా!
తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఈ మధ్య కాలంలో కొన్ని క్రేజీ సినిమాలు వచ్చాయి. అందులో డిఫరెంట్ కాన్సెప్టుతో తెరకెక్కిన చిత్రాలు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాయి. వాటిలోనూ క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన సినిమాలు మరింతగా సక్సెస్ అయ్యాయి. అలా కొద్ది రోజుల క్రితమే తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన క్రేజీ సినిమానే 'మంగళవారం'.
ఇండియాలోనే ఏ భాషలోనూ టచ్ చేయని కాన్సెప్టుతో రూపొందిన 'మంగళవారం' మూవీకి ప్రీమియర్స్ నుంచే అదిరిపోయే టాక్ వచ్చింది. ఆ తర్వాత కూడా ఇదే కంటిన్యూ అయింది. అందుకు తగ్గట్లుగానే దీనికి మంచి ఓపెనింగ్స్ వచ్చినా.. ఆ తర్వాత మాత్రం క్రమంగా డౌన్ అవుతూ వచ్చాయి. అయినప్పటికీ మంచి వసూళ్లతోనే ఈ సినిమా రన్‌ను ముగించుకుంది.

టాలీవుడ్ బోల్డు హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో అజయ్ భూపతి తెరకెక్కించిన 'మంగళవారం' సినిమాపై అంచనాలు ఏర్పడడడంతో డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ ఈ రైట్స్‌ను కొనుగోలు చేసింది. ఇందుకోసం సదరు సంస్థ చిత్ర నిర్మాతలకు భారీ మొత్తాన్నే చెల్లించినట్లు తెలిసింది.
క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'మంగళవారం' మూవీని థియేటర్లలోకి వచ్చిన 30 రోజుల తర్వాతనే స్ట్రీమింగ్‌కు తెస్తారని కూడా న్యూస్ వచ్చింది. కానీ, దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే కాస్త ఆలస్యం చేస్తూ ఈ సినిమాను డిసెంబర్ 26వ తేదీ అంటే నేటి అర్ధరాత్రి నుంచే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ స్ట్రీమింగ్‌కు తీసుకు వచ్చేసింది.

తాజాగా డిజిటల్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చిన 'మంగళవారం' మూవీలో మరింత ఎక్కువ కంటెంట్‌ను జోడించినట్లు తెలిసింది. అందులో సెన్సార్ బోర్డు కట్ చేసిన, మ్యూట్ చేసిన డైలాగులతో పాటు మరిన్ని సన్నివేశాలను యాడ్ చేశారని అంటున్నారు. ఇది నిజంగా పాయల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూసే అని చెప్పాలి.
ఇదిలా ఉండగా.. 'మంగళవారం' మూవీని స్వాతి గుణుపాటి, సురేష్ వర్మ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో అజయ్ ఘోష్, నందిత శ్వేత, కృష్ణ చైతన్య, దివ్య పిళ్లై తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు అంజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని అందించాడు. ప్రియదర్శి సర్‌ప్రైజింగ్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











