ఓటీటీలోకి పాయల్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఫుల్లు ట్విస్టులున్న దీన్ని ఎక్కడ చూడాలంటే!

ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీలు పెద్దగా వచ్చేవి కాదు. కానీ, ఇలా అడపాదడపా వచ్చిన సినిమాకు ప్రేక్షకుల మంచి స్పందనను అందిస్తున్నారు. దీంతో ఈ మూవీలు ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా తెరకెక్కుతోన్నాయి. ఇలా కొద్ది రోజుల వ్యవధిలోనే చాలా సినిమాలు వచ్చాయి. ఈ క్రమంలోనే వచ్చిన మరో క్రేజీ మూవీనే 'రక్షణ'.

టాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రమే 'రక్షణ'. ఓ ఏరియాలో వరుసగా మర్డర్లు జరుగుతుంటాయి. వాటికి తగిన సాక్ష్యాలు లేకపోవడంతో ఆత్మహత్యలుగా కేసులు క్లోజ్ అవుతుంటాయి. ఈ పరిస్థితుల్లో పోలీస్ అధికారి అయిన హీరోయిన్ ఈ కేసులను ఎలా ఛేదించింది అనే కాన్సెప్టుతో ఈ సినిమా రూపొందింది.

Payal Rajput Starrer Rakshana Movie Streaming On AHA From August 1st

ఎన్నో ట్విస్టులతో సాగే కథతో రూపొందిన 'రక్షణ' సినిమా మంచి అంచనాలతో థియేటర్లలోకి వచ్చేసింది. ఈ మూవీకి మొదటి రోజే ఆశించిన టాక్ లభించలేదు. ఫలితంగా ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి డీసెంట్‌ రెస్పాన్స్‌ను సొంతం చేసుకోలేకపోయింది. అలా ఫుల్ రన్‌లోనూ థియేటర్లలో మంచి ప్రదర్శన చేయలేదు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోలేదు.

క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్టుతో రూపొందిన 'రక్షణ' సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ మూవీ ఓటీటీ హక్కులకు మంచి పోటీ నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఆహా సంస్థ సొంతం చేసుకుంది. ఇందుకోసం సదరు సంస్థ నిర్మాతలకు మంచి మొత్తాన్నే ఇచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Payal Rajput Starrer Rakshana Movie Streaming On AHA From August 1st

పాయల్ రాజ్‌పుత్ నటించిన 'రక్షణ' సినిమాను థియేటర్లలోకి వచ్చిన 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారని టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే జూన్ 7వ తేదీన విడుదలైన ఈ చిత్రానర్ని ఆగస్టు 1వ తేదీ నుంచే ఓటీటీలోకి తీసుకు వస్తున్నట్లు ఆహా సంస్థ తాజాగా వెల్లడించింది. ఈ మేరకు 'లేడీ సింగం వచ్చేస్తుంది' అనే క్యాప్షన్‌తో పోస్టర్‌ను సైతం వదిలింది.

ఇదిలా ఉండగా.. పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించిన 'రక్షణ' సినిమాను ప్రణ్‌దీప్ ఠాకూర్ తెరకెక్కించాడు. హరిప్రియ క్రియేషన్స్ బ్యానర్‌పై దీన్ని ప్రణ్‌దీప్ ఠాకూర్ నిర్మించారు. ఇందులో బిగ్ బాస్ మానస్, రోషన్‌లు కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రానికి మహతీ స్వర సాగర్ సంగీతాన్ని అందించాడు.

More from Filmibeat

Read more about: rakshana payal rajput
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X