OTTలోకి రీసెంట్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్.. ఎందులో చూడాలంటే?
పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మంగళవారం సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే థియేటర్ రన్ పూర్తి చేసుకోగా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందని ప్రేక్షకులు అందరూ ఆసక్తి ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కి సంబంధించిన ప్రకటన వచ్చేసింది. ఆ వివరాల్లోకి వెళితే...
పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ లో నటించిన "మంగళవారం" సినిమా రీసెంట్ గా ఆడియెన్స్ ముందుకొచ్చి సూపర్ హిట్ అందుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సైతం సాధించింది. సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు అజయ్ భూపతి మంగళవారం సినిమాను రూపొందించగా పాయల్ రాజ్ పుత్ తో కలసి నందిత శ్వేత, దివ్య పిల్లై, అజ్మల్ అమీర్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.

సిల్వర్ స్క్రీన్ పై సక్సెస్ ఫుల్ గా రన్ అయిన ఈ సినిమా త్వరలో డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అవుతోందనీ అంటున్నారు. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో మంగళవారం సినిమా త్వరలో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుందనీ అధికారిక ప్రకటన వచ్చింది. ఇక ఈ మేరకు ఈ సినిమా ప్రీమియర్ డేట్ ను త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు.
ఈ నెలలోనే మంగళవారం సినిమా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ప్రీమియర్ కానుందనీ తెలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఓటీటీ రికార్డ్స్ కూడా క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయనీ మేకర్స్ భావిస్తున్నారు. నిజానికి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ప్రసారమవుతుందని ఆ మధ్య కొంత ప్రచారం జరిగింది. కానీ డిస్ట్రిక్ట్ హాట్ స్టార్ సంస్థ మొత్తం ఐదు భాషలకు సంబంధించిన రైట్స్ కొనుగోలు చేయడం ఆసక్తికరంగా మారింది.
నిజానికి ఈ సినిమా గురించి ముందు నుంచి బోల్డ్ సినిమా అనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. కానీ సినిమా చూసిన తర్వాత మాత్రం అందరూ ఆశ్చర్యపోయారు. విశ్లేషకులు అందరూ సినిమా మీద ప్రశంసల వర్షం కురిపించారు. ఇక అజయ్ భూపతి కెరియర్ లో ఈ సినిమా మరో హిట్ గా నిలవగా పాయల్ రాజ్ పుత్ కెరీర్ లో కూడా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

నిజానికి ఈ సినిమాలో ప్రియదర్శి యొక్క కీలకపాత్రలో నటించాడు. కానీ ఆ విషయాన్ని సినిమా రిలీజ్ అయ్యే వరకు సినిమా యూనిట్ దాచి పెట్టింది. కొంత అది కూడా సినిమా విజయం సాధించడానికి పనికి వచ్చిందనే చెప్పాలి. మరి ఈ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ ను మీరు థియేటర్లలో మిస్ అయితే గనుక ఓటీటీలో చూసేయండి.


Click it and Unblock the Notifications











