Peddi OTT Release: పెద్ది ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే? రాంచరణ్ మూవీని ఎక్కడ చూడొచ్చంటే?
మెగా పవర్ స్టార్ రాంచరణ్, సెన్సిబుల్ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వచ్చిన పెద్ది సినిమా విషయానికి వస్తే.. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న చిత్రంలో జాన్వీ కపూర్, కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో హిందీ నటుడు దివ్యేందు శర్మ, జగపతి బాబు, ఉపేంద్ర లిమయే, కృతిశెట్టి, జాన్ విజయ్, చమ్మక్ చంద్ర, దయానంద్ రెడ్డి తదితరులు నటించారు.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. కోల్లా అవినాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం, ఆర్ రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. నవీన్ నూలి, ఆంటోని రుబెన్ ఎడిటర్లుగా, దీపాలీ నూర్ క్యాస్టూమ్ డిజైనర్‌గా, స్టంట్ మాస్టర్‌గా సుప్రీం సుందర్ వ్యవహరించారు. ఆర్ట్ విభాగాన్ని డేవిడ్ కుమార్ బపన్నపల్లి పర్యవేక్షించారు. ఈ సినిమా జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజై ఘన విజయం సాధించింది. అయితే ఈ సినిమాను మరోసారి ఓటీటీలో ఎప్పుడెప్పుడూ చూద్దామా? అని మెగా అభిమానులు, సగటు సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అయితే థియేట్రికల్ రన్ ముగించుకోబోతున్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే?

స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో అంటే సుమారుగా 350 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడు పోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్సీ రేటును చెల్లించి సొంతం చేసుకొన్నది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను 110 కోట్ల రూపాయలకు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకొన్నది.
అయితే పెద్ది గత 20 రోజులుగా కలెక్షన్ల జైత్రయాత్రను కొనసాగించిన నేపథ్యంలో జూన్ 23వ తేదీన హైదరాబాద్ శిల్పకళా వేదికలో సక్సెస్ సెలబ్రేషన్స్‌ను జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా 420 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుకు చేరువైంది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉండగా, థియేట్రికల్ జర్నీ ముగియడానికి సిద్దంగా ఉన్న ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవడానికి రెడీ అవుతున్నది. ఈ చిత్రాన్ని జూలై 16వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ సంస్థతో చేసుకొన్న ఒప్పందం ప్రకారం ఈ డేట్‌కు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ నిబంధనలు మార్చుకొంటే.. ఇంకా ముందే వచ్చే అవకాశాలు లేకపోలేదనే మాట కూడా వినిపిస్తున్నది.


Click it and Unblock the Notifications

