Peddi OTT: ఓటీటీలోకి పెద్ది.. రామ్ చరణ్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎందులో అంటే?

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన మూవీ పెద్ది. వృద్ది సినిమాస్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై కిలారు వెంకట సతీష్, ఇషాన్ సక్సేనాలు పెద్ది సినిమాను సంయుక్తంగా నిర్మించారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌ సంస్ధలు సమర్పిస్తున్నాయి.పెద్దిలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. జూన్ 4వ తేదీన పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పెద్ది రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా ఏ ఓటీటీలో రిలీజ్ కానుంది? ఓటీటీ పార్ట్‌నర్ ఎవరు? స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అనేది ఆసక్తిగా మారింది. ఈ వివరాల్లోకి వెళితే..

పెద్ది తారాగణం
పెద్దిలో కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్, టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు, దివ్యెందు శర్మ, విజి చంద్రశేఖర్, బొమన్ ఇరానీ, రవికిషన్, సత్య, జాన్ విజయ్, అజయ్ ఘోష్, ఉపేంద్ర లిమాయే, ఆడుకలామ్ నరేన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇక స్టార్ హీరోయిన్ శృతిహాసన్ స్పెషల్ సాంగ్‌తో అలరించనున్నారు. ఆస్కార్ అవార్డ్ విజేత, మ్యూజిక్ మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రత్నవేలు కెమెరామెన్‌గా, నవీన్ నూలీ ఎడిటర్‌గా సేవలందిస్తున్నారు.

Peddi OTT Release When And Where To Watch Ram Charan s Movie Online After Theatrical Run

పెద్ది బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి పెద్ది మూవీని 350 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లుగా టాలీవుడ్ టాక్. 1980 నాటి విజయనగరం సెట్‌తో, భారీ క్రీడా మైదానం, సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ కోసం నిర్మాతలు భారీ ఖర్చు చేశారు. రామ్ చరణ్ క్రేజ్, టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగినట్లుగానే పెద్దికి భారీగా థియేట్రికల్, నాన్న థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ట్రేడ్ వర్గాల సమాచారాన్ని బట్టికి పెద్దికి దాదాపు 625 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట.

పెద్ది ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
తెలుగు రాష్ట్రాల్లో పెద్ది థియేట్రికల్ రైట్స్ వివరాలు చూస్తే.. నైజాం, ఆంధ్రా, సీడెడ్ ఏరియాల హక్కులు సుమారుగా 165 కోట్ల మేర అమ్ముడుపోయాయి. ఓవర్సీస్ రైట్స్ 40 కోట్ల రూపాయలు , కర్ణాటకలో 25 కోట్ల రూపాయలు, తమిళనాడులో 15 కోట్ల రూపాయలు , కేరళలో 7 కోట్ల రూపాయలు , నార్త్ ఇండియాలో 100 కోట్ల రూపాయలు చొప్పున సుమారుగా 350 కోట్ల రూపాయల మేర జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ చిత్రం బిజినెస్ మొత్తం 625 కోట్ల రూపాయలు మేర జరిగిందని తెలిసింది. ఆ సినిమాను నార్త్ ఇండియాలో భారీ ఎత్తున జియో స్టూడియోస్ రిలీజ్ చేస్తున్నది. నార్త్ ఇండియాలో జియో స్టూడియోస్, కర్ణాటకలో కిషోర్ ప్రొడక్షన్స్, తమిళనాడు కేరళలో థింక్ స్టూడియోస్ సంస్థలు పెద్దిని రిలీజ్ చేస్తున్నాయి.

పెద్ది నాన్ థియేట్రికల్ బిజినెస్
అలాగే ఓటీటీ, ఆడియో రైట్స్, శాటిలైట్ రైట్స్ కలిపి 275 కోట్ల రూపాయల మేరకు అమ్ముడుపోయినట్లుగా తెలుస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హందీ భాషల్లో పెద్ది డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దాదాపు 130 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి దక్కించుకున్నట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. పెద్ది సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద దాదాపు 700 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉందని వాల్యూ నిర్దేశించారు.

పెద్ది ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
థియేటర్‌లో విడుదలైన 6 వారాలు లేదా 45 రోజుల తర్వాత పెద్దిని ఓటీటీలో రిలీజ్ చేయాలనే కండీషన్ మీద నిర్మాతలతో నెట్‌ఫ్లిక్స్ ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం జూలై చివరి వారంలో రామ్ చరణ్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌లోకి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే థియేట్రికల్ రన్‌ను బట్టి ఓటీటీ రిలీజ్ ఆలస్యం కావొచ్చు.. లేదా ముందుకు జరగొచ్చు. పెద్ది ఓటీటీ స్ట్రీమింగ్‌పై త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.

Read more about: peddi ram charan netflix
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X