Peddi OTT: ఓటీటీలో పెద్దికి రికార్డు బిజినెస్.. రాంచరణ్ మూవీకి ఎన్ని కోట్ల డీల్ అంటే?

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న మూవీ పెద్ది. బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్, టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 30న పెద్ది చిత్రం వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లు, ఇటీవల రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన పెద్ది పహిల్వాన్ గ్లింప్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ది మూవీ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ గురించి ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే పెద్ది ఓటీటీ రైట్స్‌కు భారీ బిజినెస్ జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

పెద్ది తారాగణం
వృద్ది సినిమాస్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై కిలారు వెంకట సతీష్, ఇషాన్ సక్సేనాలు పెద్ది సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దివ్యెందు శర్మ, విజి చంద్రశేఖర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విజేత, మ్యూజిక్ మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రత్నవేలు కెమెరామెన్‌గా, నవీన్ నూలీ ఎడిటర్‌గా సేవలందిస్తున్నారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫి అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌లు సమర్పిస్తున్నాయి.

Peddi OTT Rights Sold to Netflix for Record Deal with Bonus Clause

పెద్ది బడ్జెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులు కలిపి పెద్ది మూవీకి 250 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్, కోనసీమతో పాటు పలు ప్రాంతాల్లో ఈ సినిమా కోసం భారీ సెట్లు వేసి ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదు నిర్మాతలు. 1980ల నాటి విజయనగరం ప్రాంతాన్ని గుర్తుచేసేలా హైదరాబాద్ శివార్లలో భారీ సెట్ వేశారు. ఇందులో పల్లె వాతావరణం, రైల్వే స్టేషన్, స్పోర్ట్స్ స్టేడియం ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే ప్రమోషనల్ కార్యక్రమాల కోసం కూడా భారీగా ఖర్చు చేస్తున్నారు.

పెద్దికి భారీ బిజినెస్
గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తోన్న మూవీ కావడంతో పెద్దిపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తెరకెక్కుతోందని అందరూ అనుకున్నారు. అయితే రెజ్లింగ్, కుస్తీ పోటీలు, గ్రామీణ కట్టుబాట్లు చుట్టూ అల్లిన కథతో బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల విడుదలైన పెద్ది పహిల్వాన్ గ్లింప్స్‌తో సినిమా కథ ఏంటీ? అనేది అందరికీ అర్ధమైపోయింది. దీనికి తగినట్లుగానే పెద్ది థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ జరుగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లోనే 200 కోట్లు?
థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. ఓవర్సీస్‌లో పెద్ది సినిమా థియేట్రికల్ రైట్స్‌ను 40 కోట్ల రూపాయలు పలికింది. నైజాంలో 63 కోట్ల రూపాయలు, నెల్లూరులో 6.3 కోట్ల రూపాయలు, తూర్పు గోదావరి రైట్స్ 12.60 కోట్ల రూపాయలకు దక్కించుకున్నారు. ఈ ట్రెండ్స్‌ను బట్టి చూస్తే ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే పెద్ది థియేట్రికల్ బిజినెస్ 200 కోట్ల మేర జరిగే అవకాశం ఉందని.. వరల్డ్ వైడ్‌గా ఇది 300 కోట్ల వరకు జరగొచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

పెద్ది ఓటీటీ రైట్స్‌కి రికార్డ్ ధర?
పెద్ది నాన్ థియేట్రికల్ బిజినెస్ విషయాలు పరిశీలిస్తే.. మ్యూజిక్ రైట్స్‌ను టీ సిరీస్ సంస్థ 35 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. శాటిలైట్ రైట్స్ 55 కోట్ల రూపాయలు పలకగా.. తాజాగా పెద్ది ఓటీటీ రైట్స్‌కు కళ్లు చెదిరే డీల్ కుదిరినట్లుగా తెలుస్తోంది. తెలుగుతో పాటు ఇతర భాషల ఓటీటీ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దాదాపు 130 కోట్ల రూపాయలకు దక్కించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక్కడే పెద్ది నిర్మాతలకు నెట్‌ఫ్లిక్స్ మరో ఆఫర్ కూడా ఇచ్చింది. థియేటర్‌లో కనుక పెద్ది బ్లాక్‌బస్టర్‌గా నిలిచి.. భారీ వసూళ్లను సాధిస్తే మరో 20 కోట్ల రూపాయలను బోనస్ కింద చెల్లిస్తామని చెప్పిందట. అంటే ఓవరాల్‌గా పెద్ది ఓటీటీ విలువ 150 కోట్ల రూపాయలు. దీని ద్వారా రామ్ చరణ్ క్రేజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మొత్తంగా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ కలిపి పెద్ది మూవీకి రిలీజ్‌కు ముందే దాదాపు 600 కోట్ల రూపాయలు వచ్చ అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

Read more about: peddi netflix ram charan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X