Petta Rap OTT: ఓటీటీలోకి సన్నీలియోన్ రొమాంటిక్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Petta Rap OTT: ప్రముఖ కొరియోగ్రాఫర్, చిత్రనిర్మాత, నటుడు ప్రభుదేవా హీరోగా నటించిన తమిళ్ మూవీ 'పేట్టా రాప్'. ఈ మూవీలో ప్రభుదేవా తో పాటు బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్, హీరోయిన్ వేదిక నటించారు. పేట్టా రాప్ మూవీకి ఎస్‌జే సిను దర్శకత్వం వహించాడు. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదలైంది. థియేటర్లలో నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించిన అఫిషియల్ అప్డేట్ వచ్చింది. ఇంతకీ ఈ రొమాంటిక్ డ్రామా ఎప్పుడు స్ట్రీమింగ్ కానున్నదంటే?
బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ బాలీవుడ్ నుంచి సౌత్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయింది. దీంతో ఈ హాట్ బ్యూటీ దూకుడు పెంచింది. ఐటం సాంగ్స్ కే కాకుండా.. గెస్ట్ రోల్స్ ల్లో నటిస్తోంది. మొత్తం మీద కన్నడం, మలయాళః, తమిళ్ భాషల్లో కలిపి దున్నేస్తుంది. వరుస సినిమాలతో బిజీబిజీగా మారింది. ఇందులో కొన్ని సినిమాలో షూటింగ్ దశలో ఉండగా.. మరికొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోనూ ఉన్నాయి.

ఇటీవల హీరో ప్రభుదేవా హీరోగా నటించిన పేటా రాప్ లో ఐటం భామగా నటించింది సన్నీ లియోన్. ఈ మూవీలో వేదిక హీరోయిన్ గా నటించగా.. ఎస్.జె శీను దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో ఎనర్జిటిక్ సాంగ్ అని ఆ పాటలో ప్రభుదేవా ఎనర్జీని సన్నిలియోన్ నటించారు. ఇప్పటికే అమ్మడు పలు సినిమాల్లో ఐటం పాటల్లో నటించింది. ఈ మూవీలో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో మరో ఛాన్స్ సన్ని కెరీర్ కి ప్లస్ అయ్యే అవకాశం ఉంది.
పేట్టా రాప్ కథ విషయానికి వస్తే.. బాలసుబ్రహ్మణ్యం (ప్రభుదేవా) సినిమా నటించాలని కలలు కంటారు. ఎన్నో సినిమా ఆడిషన్స్ కు అటెండ్ అవుతారు. కానీ, ఆయనకు ఒక్క సినిమాలో కూడా అవకాశం దొరకదు. కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, ఇరుగు పొరుగు వారు కూడా సూటిపోటి మాటలతో అమానిస్తారు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు. ఈ సమయంలో జానకి (వేదిక) అనే సింగర్ బాలు జీవితంలోకి ఎంటర్ అవుతుంది. దీంతో అతని జీవితం అనుకోని మలుపులు తిరుగుతుంది. బాలు, జానకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? బాలు జీవితం తన కలల్ని నెరవేర్చుకుంటారా? లేదా? అనేది పేట్టా రాప్ మూవీ కథ.

ఈ మూవీ విడుదలకు ముందు వచ్చిన టీజర్స్, ట్రైలర్స్‌తో అంచనాలు రేకెత్తించిన పేట్టా రాప్ మూవీ ఔట్ డేటెడ్ కాన్సెప్ట్ కారణంగా థియేటర్లలో డిజాస్టర్‌గా మారింది. ప్రభుదేవా, వేదిక యాక్టింగ్ పర్వాలేదనీ అనిపించింది. సన్నీలియోన్ తన గ్లామర్ షోతో దుమ్మురేపింది. ప్రభుదేవా సూపర్ హిట్ మూవీ ప్రేమికుడు మూవీలోని పేట్టా రాప్ పాట స్ఫూర్తితోనే ఈసినిమాకు టైటిల్‌ను ఫిక్స్‌చేశారు. పేట్టా రాప్ సినిమాకు ఇమాన్ మ్యూజిక్ అందించాడు.
ఓటీటీ విషయానికి వస్తే.. పేట్టా రాప్ మూవీ థియేటర్లలో విడుదలైన దాదాపు నెలన్నర తర్వాత ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానున్నది. ఈ యాక్షన్, రొమాంటిక్, కామెడీ మూవీ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ పేట్టా రాప్ నవంబర్ 8న ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నది.


Click it and Unblock the Notifications











