AHA OTTలోకి థ్రిల్లర్, హర్రర్, రొమాంటిక్ చిత్రాలు.. ఎప్పుడు స్ట్రీమింగ్ కానున్నాయంటే?
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలోకి క్రేజీ చిత్రాలు రాబోతున్నాయి. ఆహాలో ఇప్పటికే లవ్, రొమాంటిక్, హర్రర్, థ్రిల్లర్ మూవీస్ సందడి చేస్తున్నాయి. ప్రతి వారం ఒరిజినల్ కంటెంట్ తో పాటు పలు సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తుంటాయి. ఇక ఆహా ఓటీటీలోకి మరో 3 క్రేజీ చిత్రాలు సందడి చేయనున్నాయి. హర్రర్, థ్రిల్లర్, రొమాంటిక్ జోనర్లో తెరకెక్కిని ఈ చిత్రాలు ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ కానున్నాయి. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
ఆహాలోకి మరో మూడు చిత్రాలు రాబోతున్నాయి. అందులో మొదటిది.. థియేటర్లలో భయపెట్టిన హర్రర్ చిత్రం పిండం. గర్భిణీ స్త్రీలు ఈ చిత్రం చూడకూడదని.. సెన్సార్ బోర్డ్ ప్రకటించింది. ఇక ఈ చిత్రంలో శ్రీరామ్, ఖుషిరవి, ఈశ్వరీరావు ప్రధాన పాత్రల్లో నటించారు. పిండం మూవీ థియేటర్లలో మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ.. ఈ చిత్రం మాత్రం చాలా మందిని భయపెట్టింది. హారర్ మూవీగా దర్శకుడు సాయికుమార్ దైదా ఈ సినిమాను రూపొందించాడు.

డిసెంబర్ 15న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ దాదాపు నలభై ఐదు రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఇక ఈ సినిమాను త్వరలోనే ఓటీటీలోకి తీసుకురాబోతున్నట్లు ఆహా ఓటీటీ తన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది. ఒక కాకి పిండం తింటున్న ఫోటోను పోస్ట్ చేసి 'భయంకరమైన సినిమా' అంటూ రాసుకువచ్చింది. ఇక క్యాప్షన్ లో గెస్ చేస్తూ ఉండండని చెప్పుకువచ్చింది. దీంతో ఇది పిండం సినిమా అని నెటిజన్స్ అర్ధం చేసుకుని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇక యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం బబుల్ గమ్. ఈ సినిమా డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకొచ్చి పర్వాలేదనిపించుకుంది. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రానికి క్షణం ఫేమ్ రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించగా... మానస చౌదరి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే కథలో కొత్తదనం లేకపోవడం వల్ల ఈ సినిమా థియేటర్లలో ఆకట్టుకోలేకపోయింది ఇప్పుడు ఈ చిత్రం ఆహా ఓటీటీలోకి రాబోతుంది. ఈ విషయాన్ని ఆహా తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

ప్రియమణి నటించిన 'భామా కలాపం'.. ఫస్ట్ పార్ట్ నేరుగా ఓటీటీలో విడుదల అయి సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక దీనికి కొనసాగింపుగా భామా కలాపం 2 రాబోతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. భామ కలాపం 2 సీక్వెల్ కు కూడా అభిమాన్యు తాడిమేటినే దర్శకత్వం వహించగా.... బాపినీడు బీ, సుధీర్ ఎదార.. 'భామా కలపాం 2'కు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు ఈ చిత్రం ఆహా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతుంది.
ఇక ఆహాలో వీటితో పాటు.. పలు క్రేజీ చిత్రాలు కూడా సందడి చేస్తున్నాయి. మీరు కనుగ మూవీ లవర్ అయితే.. ఇంట్లోనే కూర్చొని.. సినిమాలు, సిరీసులను ఇంట్లోనే ఎంచాక్క చూసి ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











