OTT: రిలీజై వారం కాకముందే ఓటీటీలోకి వచ్చేసిన హారర్ థ్రిల్లర్ మూవీ... స్ట్రీమింగ్ ఎందులో అంటే?
సినిమా విడుదల అయి వారం రోజులు కాలేదు... అప్పుడే ఓటీటీలోకి వచ్చేసింది పిజ్జా 3. అశ్విన్ కాకుమణి, పవిత్ర ప్రధాన పాత్రల్లో మోహన్ గోవింద్ తెరకెక్కించిన చిత్రం పిజ్జా3. పిజ్జా ప్రాంజైజీ నుంచి వచ్చిన ఈ హారర్ మూవీ.. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనే వివరాల్లోకి వెళితే....
ఓ సినిమా హిట్ అయితే... దానికి కొనసాగింపుగా సినిమాలు రావడం ఇప్పుడు కామన్. అయితే 2012లో పిజ్జా అనే మూవీ వచ్చి సూపర్ హిట్టుగా నిలిచింది. ఈ మూవీలో విజయ్ సేతపతి హీరో. ఈ చిత్రానికి కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్టుగా నిలిచి.. వసూళ్లను కురిపించింది. ఇక ఈ మూవీతో విజయ్ సేతుపతికి కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఆయన యాక్టింగ్ కు అందరూ ఫిదా అయ్యారు. తిరుకుమారన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై సి. వి. కుమార్ నిర్మించారు.

ఇక పిజ్జా సక్సెస్ కావడంతో... పిజ్జా 2 (పిజ్జా ది విల్లా) చిత్రాన్ని తెరకెక్కించారు. 2013లో విడుదలైన ఈ సినిమా గ్రూప్, స్టూడియో సౌత్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై సి.వీ. కుమార్ నిర్మించారు. ఇక ఈ సినిమాకు దీపన్ చక్రవర్తి దర్శకత్వం వహించాడు. అశోక్ సెల్వన్, సంచితా షెట్టి, నాజర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తమిళంలో 14న, తెలుగులో నవంబరు 16, 2013న విడుదలైంది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదనిపించింది.
ఇక పిజ్జా2 అనకున్న స్థాయిలో సక్సెస్ కాకపోడంతో... పిజ్జా 3 తెరకెక్కించేందుకు 10 ఏళ్ల సమయం పట్టింది. తమిళంలో విడుదలై ఘన విజయం అందుకున్న పిజ్జా 3 ని వారం క్రితం.. ఈ సినిమాను థియేటర్లోకి తీసుకువచ్చారు నిర్మాతలు ఎం.ఎస్ మురళీధర్ రెడ్డి, ఆశిష్ వేమిశెట్టి. ఈ చిత్రాన్ని కనెక్ట్ మూవీస్ ఎల్‌ఎల్‌పీ సంస్థ బేనర్ పై తెలుగులో విడుదల చేశారు. 'పిజ్జా 3'లో అశ్విన్ కాకుమణి, పవిత్ర మరిముత్తు ప్రధాన పాత్రలు పోషించారు. మోహన్ గోవింద్ దర్శకత్వం వహించారు.

పిజ్జా 3 కూడా సక్సెస్ అవుతుందని అంతా అనుకున్నారు. రిలీజ్ చేసిన ట్రైలర్ ఆద్యంతం హారర్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ను ఇచ్చింది. నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ కథ తాలూకు భావోద్వేగాలను ప్రేక్షకుల ముందుంచాయి. దీంతో థియేటర్లలో సక్సెస్ అవుతుందని అనుకున్నారు. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద నిలబడలేకపోయింది. రిలీజ్ అయి వారం కాకముందే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. పిజ్జా 3 అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఆగస్టు 25 నుంచి ఈ మూవీ అందుబాటులోకి వచ్చేసింది. మీరు గనుక థియేటర్లలో ఈ మూవీని మిస్ అయితే ఓసారి ఓటీటీలో చూసేయొచ్చు.


Click it and Unblock the Notifications











