Ponniyin Selvan 2 OTT: ఆ ఓటీటీలో తమిళ బాహుబలి.. ఊహించని విధంగా ముందుగానే!
తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి కొంత కాలంగా అతి భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. దీంతో మన సినిమా రేంజ్ భారీ స్థాయిలో పెరిగిపోతోంది. దీంతో పక్క ఇండస్ట్రీలు కూడా టాలీవుడ్‌ను ఫాలో అవుతూ భారీ బడ్జెట్‌తో సినిమాలు చేస్తున్నాయి. అలా గత ఏడాది వచ్చిన చిత్రమే 'పొన్నియన్ సెల్వన్ 1'. చోళుల కాలం నాటి కథతో రూపొందిన ఈ పిరియాడిక్ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి భారీ స్పందన వచ్చి హిట్ అయింది. దీంతో ఇప్పుడు దీనికి కొనసాగింపుగా గత శుక్రవారమే 'పొన్నియన్ సెల్వన్ 2' మూవీని తీసుకు వచ్చారు.
దిగ్గజ దర్శకులు మణిరత్నం డైరెక్షన్‌లో ఎంతో మంది స్టార్లు కలిసి నటించిన చిత్రమే 'పొన్నియన్ సెల్వన్ 2'. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక లొకేషన్లలో విడుదలైంది. అందుకు అనుగుణంగానే దీనికి అన్ని వర్గాల వాళ్ల నుంచి మంచి టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రానికి మొదటి రోజే దాదాపు రూ. 50 కోట్లు గ్రాస్ వసూలైంది. ఇక, రెండో రోజు కూడా అదే ఊపు కంటిన్యూ చేస్తూ వంద కోట్ల మార్కును చేరుకుని భారీ వసూళ్ల దిశగా సాగిపోతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఓటీటీ డీల్ వివరాలు లీక్ అయ్యాయి.

మొదటి భాగం సూపర్ హిట్ అవడంతో 'పొన్నియన్ సెల్వన్ 2' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. అంతేకాదు, థియేటర్లలో విడుదలైన నెల రోజులకే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని కూడా క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.. అంటే ఏప్రిల్ 28న విడుదలైన 'పొన్నియన్ సెల్వన్ 2' మే 28నే స్ట్రీమింగ్‌కు వస్తుందనే టాక్ వినిపిస్తోంది.

చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తి, జయం రవి, శోభిత ధూళిపాళ్ల ప్రధాన పాత్రల్లో మణిరత్నం తెరకెక్కించిన చిత్రమే 'పొన్నియన్ సెల్వన్ 2'. ఈ సినిమాను మణిరత్నం, శుభకరణ్ అల్లిరాజయ్య సంయుక్తంగా నిర్మించారు. దీనికి ఏఆర్ రెహమాన్ సంగీతం ఇచ్చారు.


Click it and Unblock the Notifications











