PS 2 OTT: ఓటీటీలోకి వచ్చేసిన తమిళ బాహుబలి.. ఏఏ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే!
సౌతిండియాలోని ఇండస్ట్రీల నుంచి గతంలో కంటే ఈ మధ్య కాలంలో భారీ బడ్జెట్ చిత్రాలు చాలానే వస్తున్నాయి. ముఖ్యంగా తమిళంలోనూ ఈ తరహా సినిమాలు ఎక్కువ సంఖ్యలోనే తెరకెక్కుతోన్నాయి. ఇలా గత ఏడాది ఎంతో మంది స్టార్లు కలిసి నటించిన 'పొన్నియన్ సెల్వన్ 1' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మంచి స్పందన రావడంతో భారీ కలెక్షన్లు వచ్చి సూపర్ హిట్ అయింది. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండానే దీనికి సీక్వెల్‌గా 'పొన్నియన్ సెల్వన్ 2' మూవీని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.
దిగ్గజ దర్శకుడు మణిరత్నం రూపకల్పనలో చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తి, జయం రవి, శోభిత ధూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మి వంటి పేరున్న నటీనటులు కలిసి నటించిన 'పొన్నియన్ సెల్వన్ 2' మూవీకి మొదటి భాగం కంటే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఆరంభంలోనే దీనికి అదిరిపోయే వసూళ్లు దక్కాయి. కానీ, రెండో వారం నుంచి ఈ చిత్రానికి కలెక్షన్లు మాత్రం నిరాశజనకంగానే వచ్చాయి. అయినప్పటికీ ఈ మూవీ రెండు వారాల్లోనే ఏకంగా రూ. 300 కోట్లు గ్రాస్ మార్కును దాటింది. తర్వాత మరో ఇరవై కోట్ల లోపు గ్రాస్‌ను రాబట్టి రన్‌ను ముగించింది.

'పొన్నియన్ సెల్వన్ 2' అనుకున్న సమయానికి కంటే ఓటీటీలోకి వచ్చేస్తుందని జోరుగా ప్రచారం జరిగింది. అయితే, ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ పరిస్థితుల్లో ఇటీవలే రెంట్ పద్దతిలో దీన్ని తీసుకు వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు (జూన్ 2) ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో ఇది తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనికి అక్కడ కూడా మంచి స్పందనే దక్కే ఛాన్స్ ఉంది.

ఇదిలా ఉండగా.. చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తి, జయం రవి, శోభిత ధూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మి వంటి పేరున్న నటీనటుల కలయికలో మణిరత్నం రూపొందించిన చిత్రమే 'పొన్నియన్ సెల్వన్ 2'. ఈ భారీ బడ్జెట్ పిరియాడిక్ సినిమాను శుభకరణ్ అల్లిరాజయ్యతో కలిసి మణిరత్నం స్వయంగా నిర్మించారు. దీనికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











