OTT : 2 ఓటీటీల్లోకి బిగ్​బాస్​ బ్యూటీ హారర్ సినిమా - స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలో రకరకాల జానర్ సినిమాల వస్తుంటాయి. అందులో హారర్ జానర్ సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. దీంతో ఈ మధ్య హారర్ చిత్రాలను సదరు ఓటీటీ సంస్థలు ఎక్కువగా రిలీజ్ చేస్తున్నాయి. అలా తాజాగా ఓ హారర్ జానర్ మూవీ స్ట్రీమింగ్​కు రెడీ అయింది. పైగా అందులో బిగ్ బాస్ బ్యూటీ శుభ శ్రీ కూడా నటించింది. ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఎప్పుడు నుంచి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో వివరాలను తెలుసుకుందాం..

డెవిల్ ఓటీటీలో రిలీజ్​కు రెడీ: నటి పూర్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోయిన్​గా అవకాశాలు రాకపోయినా సపోర్టివ్​ రోల్స్​ లేదా స్పెషల్ సాంగ్స్​తో కెరీర్​ను బానే నెట్టుకొస్తోంది. రీసెంట్​గా గుంటూరు కారం చిత్రంలో కూర్చి మడటపెట్టి సాంగ్​లో చిందులేసి ఆకట్టుకుంది. అయితే తాజాగా ఆమె లీడ్​లో నటించిన హార‌ర్ చిత్రం డెవిల్ ఓటీటీలో రిలీజ్​కు రెడీ అయింది.

Poorna Bigg Boss Subhashree Devil Movie Streaming on Amazon Prime Video, TentKotta From March 1st Full Details Here

2 ఓటీటీల్లో స్ట్రీమింగ్: ఆథియా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మిస్కిన్ మ్యూజిక్ అందించాడు. వీరిద్దరు అన్నదమ్ములు కావడం విశేషం. ఫిబ్రవరి 2న థియేటర్లలోకి వచ్చిన ఈ డెవిల్​ చిత్రం పర్వాలేదనిపించింది. ఇప్పుడు నెల కూడా తిరగకుండానే ఓటీటీలోకి వచ్చేస్తోంది. మార్చి 1న టెంట్‌కోటా ఓటీటీతో పాటు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది.

Poorna Bigg Boss Subhashree Devil Movie Streaming on Amazon Prime Video, TentKotta From March 1st Full Details Here

డెవిల్ కథేంటంటే?: ఇకపోతే ఈ డెవిల్ చిత్రంలో హేమ అనే గృహిణిగా పూర్ణ క‌నిపించి ఆకట్టుకుంది. సినిమాలో హేమా భ‌ర్త అలెక్స్ ఓ ఫేమ‌స్ లాయ‌ర్​. కానీ అత‌డు స్త్రీలోలుడు. త‌న ఆఫీస్‌లోనే వర్క్​ చేసే సోఫియా అనే యువతితో రిలేష‌న్‌షిప్ మెయిన్​టెయిన్ చేస్తుంటాడు. అయితే ఈ క్రమంలోనే ఓ యాక్సిడెంట్ ద్వారా హేమ జీవితంలోకి రోష‌న్ ఎంట్రీ ఇస్తాడు. మరి ఆ త‌ర్వాత ఏమైంది? రోష‌న్‌, హేమ‌ల బంధం గురించి తెలిసిన అలెక్స్ వాళ్లను ఏం చేశాడు? అన్న‌దే ఈ డెవిల్ చిత్ర క‌థ‌. పూర్ణ న‌ట‌న బాగుంది. కానీ రొటీన్ స్టోరీ కావడం వల్ల డెవిల్ చిత్రం క‌మ‌ర్షియ‌ల్​గా మంచి సక్సెస్​ను అందుకోలేకపోయింది.

Poorna Bigg Boss Subhashree Devil Movie Streaming on Amazon Prime Video, TentKotta From March 1st Full Details Here

రెండేళ్ల తర్వాత రీఎంట్రీ: పూర్ణ తెలుగు, మలయాళంతో పాటు కోలీవుడ్​లోనూ పలు చిత్రాల్లో నటించింది. అయితే చివరిసారిగా 2022లో విసితిరన్ అనే చిత్రంలో నటించింది. మళ్లీ దాదాపు రెండేళ్ల గ్యాప్ త‌ర్వాత పూర్ణ ఈ చిత్రంతో కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. కానీ ఆమెకు ఈ సినిమా పెద్దగా విజ‌యాన్ని తెచ్చిపెట్ట‌లేక‌పోయింది. ఇకపోతే ఈ డెవిల్ చిత్రంలో పూర్ణ‌తో పాటు మ‌రో టాలీవుడ్ హీరో త్రిగుణ్ కూడా కీల‌క పాత్రలో కనిపించాడు. విదార్థ్ క‌థానాయ‌కుడిగా న‌టించాడు.

త్రిగుణ్ విషయానికొస్తే: త్రిగుణ్ చాలానే సినిమాలు చేశాడు. చీక‌టి గ‌దిలో చిత‌క్కొట్టుడు, డియ‌ర్ మేఘ‌, 24 కిసెస్‌, కొండ‌తో పాటు పలు వైవిధ్య‌మైన చిత్రాలు చేశాడు. కానీ క‌మ‌ర్షియ‌ల్ హిట్​ అందుకోలేక‌పోయాడు. రీసెంట్​గా నివేదిత అనే అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడు. ప్ర‌స్తుతం కిరాయి, గంజామ్​తో పాటు మ‌రికొన్ని సినిమాల్లో నటిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X