Netflix: కొత్త బిజినెస్‌లోకి నెట్ ఫ్లిక్స్.. ఓటీటీ దిగ్గజం కొత్త ఐడియాతో జేబుకు చిల్లేనా?
గడిచిన జస్ట్ కొన్నేళ్ల వ్యవధిలో ప్రపంచ వ్యాప్తంగా ఓటిటి అనే ప్లాట్ ఫామ్ ప్రేక్షకుల్లోకి ఎంతలా చొచ్చుకెళ్లిపోయిందో చూస్తూనే ఉన్నాము. మెయిన్ హా కోవిడ్ ఎఫెక్ట్ తో అయితే ప్రపంచ వ్యాప్తంగా ఓటిటిని వినియోగించే వారు కూడా ఎక్కువయ్యారు. అయితే వరల్డ్ వైడ్ గా అనేక ప్లాట్ ఫామ్ లు ఓటిటి కంటెంట్ ని అందిస్తున్నారు.
మరి పదుల సంఖ్యలో టాప్ మోస్ట్ ప్లాట్ ఫామ్ లు ఉన్నప్పటికీ వాటిలో కింగ్ ఆఫ్ ఓటిటి ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా నెట్ ఫ్లిక్స్ అనే చెప్పాలి. కాగా వరల్డ్ వైడ్ గా 230 మిలియన్ కి పైగా సబ్ స్క్రైబర్ లు ఉన్నారు. అయితే ఇన్నాళ్లు నెట్ ఫ్లిక్స్ నుంచి ఇంటర్నేషనల్ వైడ్ గా కేవలం ఎంటర్టైనింగ్ కంటెంట్ మాత్రమే వచ్చేది.

వారు కేవలం ఎంటర్టైనింగ్ రంగంకి మాత్రమే స్థిరపడి తమ బిజినెస్ ని జరుపుతున్నారు. కానీ ఇంకో పక్క అమెజాన్ అయితే తమకి ప్రైమ్ వీడియో అనే ఓటిటి ప్లాట్ ఫామ్ ఉంది అలాగే ఈ కామర్స్ కూడా ఉంది. అయినా కూడా నెట్ ఫ్లిక్స్ ని వారు బీట్ చేయడానికి ఇంకా కష్టపడుతున్నారు. అయితే ఆ మధ్య నెట్ ఫ్లిక్స్ కి భారీ నష్టాలు కూడా వచ్చాయి కానీ ఫైనల్ గా వారు పుంజుకున్నారు.
మరి ఈసారి ఏమనుకున్నారో ఏమో కానీ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కి పర్ఫెక్ట్ కాంబినేషన్ గా మరో రంగంలోకి వీరు అడుగు పెట్టబోతున్నారు. చాలా మంది నెట్ ఫ్లిక్స్ చూస్తూ ఫుడ్ తినాలని చేస్తూ ఉంటారు. మీమ్స్ లో కూడా చాలానే మనం చూసి ఉంటాం. అలాగే థియేటర్స్ లో కూడా ఇంటర్వెల్ లో లేదా ముందే పాప్ కార్న్ కూడా తింటూ ఉంటారు.
మరి నెట్ ఫ్లిక్స్ తమ బ్రాండ్ తో పాప్ కార్న్ ని అమ్మేందుకు సిద్ధం అయ్యారు. మరి రెండు ఫ్లేవర్ లలో పాప్ కార్న్ ని తీసుకొస్తున్న వీరు ఒకొకటి నాలుగున్నర డాలర్స్ పెట్టారు. అంటే ఒక్క పాప్ కార్న్ ధర 375 రూపాయలు అలా ఉంటుంది. మరి ఇది ఇపుడు ఉన్న మల్టిప్లెక్స్ లతో పోలిస్తే సుమారుగానే ఉందని చెప్పాలి.
ఇంకా నెట్ ఫ్లిక్స్ బ్రాండింగ్ కూడా ఉంది కాబట్టి వీరి ప్రయత్నం సక్సెస్ అవుతందనే చెప్పొచ్చు. కాగా దీన్ని ముందు నెట్ ఫ్లిక్స్ వారు యూఎస్ లో స్టార్ట్ చేసారు. మరి మన దేశంలో కూడా మొదలవుతుందో లేదో చూడాలి. మన దేశంలో కూడా నెట్ ఫ్లిక్స్ వినియోగదారులు చాలానే ఉన్నారు. ఇందులో నెట్ ఫ్లిక్స్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











