Adipurush OTT: 'ఆదిపురుష్'కి భారీ దెబ్బ.. ప్లాన్ మార్చిన నిర్మాతలు.. 2 వారాల్లో ఓటీటీలోకి?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాపై అభిమానులు, ప్రేక్షకులు ఎన్నో ఆశలు, అంచనాలు పెట్టుకున్న విషయం తెలిసిందే. కానీ సినిమా విడుదల తర్వాత ఆ అంచనాలు తారుమారు, ఆశలు గల్లంతు అయ్యాయి. రామాయణ కథాంశంతో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా విడుదలకు ముందు ఓ మాట, తర్వాత మరో మాట చెబుతూ మేకర్స్ నెట్టుకొస్తున్నారు. నెగెటివిటినీ పొగొట్టాలని చేస్తున్న ఏ ప్రయత్నం ఫలించకపోగా తాజాగా ఆదిపురుష్ ఓటీటీ స్ట్రీమింగ్ విషయం ఆసక్తికరంగా మారింది.
హాట్ బ్యూటి:రామాయణం కథ ఆధారంగా రూపొందిన ప్రభాస్ పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్. శ్రీరాముడిగా ప్రభాస్ అలరించిన ఈ సినిమాలో పరమ శివ భక్తుడు రావణ బ్రహ్మగా సైఫ్ అలీ ఖాన్, సీతాదేవిగా బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్, హనుమంతుడిగా మరాఠీ పాపులర్ యాక్టర్ దేవదత్తా నాగే, లక్ష్మణుడిగా బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ చేశారు. వీళ్లే కాకుండా హాట్ బ్యూటి సోనాల్ చౌహన్, తేజస్విని పండిట్, వత్సల్ సేథ్ నటించారు.

విమర్శలు:ఆదిపురుష్ సినిమాకు టీ సిరీస్ సంస్థ నిర్మాణంలో భూషణ్ కుమార్, క్రిష్ణ కుమార్, ప్రసాద్ సుతారియా, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్, ఓం రావత్ నిర్మాతలుగా వ్యవహరించారు. తానాజీ వంటి హిట్ ఇచ్చిన హిందీ దర్శకుడు ఓం రావత్ డైరెక్ట్ చేశారు. ఇక ఆది నుంచే సినిమా, దర్శకుడిపై బీభత్సమైన విమర్శలు వెల్లువెత్తాయి.
ఇంటర్నెట్ లో లీక్:ఆదిపురుష్ విడుదల తర్వాత అంటే జూన్ 16 నుంచి ఈ నెగెటివిటీ మరింత తీవ్రతరం అయింది. రాజకీయ నేతలు, ప్రేక్షకులు ఒక్కరేంటీ రామయణం తెలిసిన సగటు వ్యక్తి ఆదిపురుష్ సినిమాను విమర్శిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఆదిపురుష్ సినిమా ఆన్ లైన్ లో లీకైంది.

తలనొప్పిగా:ఇంటర్నెట్ లో ఆదిపురుష్ తమిళ వెర్షన్ HD ప్రింట్ పైరసీని పెట్టారు. ఈ పైరసీ ప్రింట్ అతి తక్కువ సమయంలోనే వైరల్ గా మారి.. ఎంతోమంది డౌన్ లోడ్ చేసుకున్నారని టాక్. ఆదిపురుష్ ఇప్పుడు తమిళ వెర్షన్ లో లీక్ అయినప్పటికీ మిగతా భాషల్లో కూడా రావడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు. దీంతో థియేటర్ లో ఆదిపురుష్ ఉండగానే ఇలా ఆన్ లైన్ లో ప్రత్యక్షం కావడంతో మేకర్స్ తలలు పట్టుకున్నారట.

రెండు వారాల్లో:అందుకే ఆదిపురుష్ ఆన్ లైన్ లీకేజీపై ఓ కీలక నిర్ణయం తీసుకున్నారట నిర్మాతలు. ఆదిపురుష్ సినిమాను త్వరలోనే ఓటీటీలోకి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ముందుగా ఆగస్టులో స్ట్రీమింగ్ చేద్దామనుకున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులను బట్టి జూలై మధ్యలో, లేదా జూలై నెలాఖరులో రానుందట. అంతేకాకుండా మరో 1-2 వారాల్లో కూడా అమెజాన్ ప్రైమ్ వేదికగా ఆదిపురుష్ ను స్ట్రీమింగ్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.


Click it and Unblock the Notifications











