Adipurush OTT Streaming: OTT లోకి సైలెంట్‌గా వచ్చేసిన ప్రభాస్ ఆదిపురుష్ .. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ప్రభాస్ రాముడిగా.. కృతి సనన్ సీతగా నటించిన మూవీ ఆదిపురుష్. ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూసిన ప్రేక్షకులకు ఆరోజు రానే వచ్చింది. సైలెంటుగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి సమాచారం, ప్రమోషన్స్ లేకుండా... గురువారం నాడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చి స్ట్రీమింగ్ అవుతోంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సైలెంటుగా ఓటీటీలో ప్రత్యేక్షం అయింది. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీకి.. ఎన్నో విమర్శలు, వివాదాలు చుట్టుముట్టాయి. బాలీవుడ్ దర్శకుడు తాన్హాజీ ఫేం ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా, కృతి సనన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా... జూన్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వచ్చింది.

రామాయణంలోని యుద్ధకాండ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. రాముడి పాత్రలో ప్రభాస్ నటించగా... జానకిగా కృతిసనన్ కనిపించింది. రావణుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటించాడు. హనుమంతుడిగా మరాఠీ పాపులర్ యాక్టర్ దేవదత్తా నాగే, లక్ష్మణుడిగా బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ చేశారు. వీళ్లే కాకుండా హాట్ బ్యూటి సోనాల్ చౌహన్, తేజస్విని పండిట్, వత్సల్ సేథ్ నటించారు.
ఇక ఆదిపురుష్ మూవీ ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ ఏడాది నిర్మాతలకు అత్యధిక నష్టాలను మిగిల్చిన సినిమాల్లో ఒకటిగా ప్రభాస్ ఆదిపురుష్ సినిమా నిలిచింది. ఇక ఈ మూవీని దాదాపు ఐదు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో టీ సిరీస్ సంస్థ నిర్మాణంలో భూషణ్ కుమార్, క్రిష్ణ కుమార్, ప్రసాద్ సుతారియా, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్, ఓం రావత్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా 350 కోట్లలోపే వసూళ్లను రాబట్టి.. నిర్మాతలకు నష్టాలు తీసుకువచ్చింది.

ఆదిపురుష్ ఇప్పుడు సైలెంటుగా ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ముందస్తు సమాచారం, ప్రమోషన్స్ లేకుండా గురువారం మిడ్ నైట్ నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేశారు. ఇక ఇప్పటి వరకు థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

ఆదిపురుష్ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ ఉండాలి. అమెజాన్ తో పాటు.. నెట్ ఫ్లిక్స్ లో కూడా ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. రిలీజ్‌కు ముందు ఆదిపురుష్ పై నెలకొన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని దాదాపు 250 కోట్లకు అమెజాన్ ప్రైమ్ డిజిటల్ రైట్స్‌ను దక్కించుకున్నట్లు సమాచారం. ఇక ఈరోజు అర్ధరాత్రి నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.


Click it and Unblock the Notifications











