OTTలో భయపెడుతున్న చిన్నారి పెళ్లి కూతురు హారర్ మూవీ... స్ట్రీమింగ్ ఎందులో అంటే?

మీకు హారర్ చిత్రాలంటే ఇష్టమా... అయితే ఈ మూవీ మీరు కచ్చితంగా చూడాల్సిందే. ఓటీటీలో ఓ హారర్ మూవీ రచ్చరేపుతోంది. చిన్నారి పెళ్లి కూతురు ఫేం అవికా గోర్ నటించిన హారర్ మూవీ 1920: హారర్స్‌ ఆఫ్‌ ది హార్ట్‌.. థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా రిలీజ్ అయి.. ఆకట్టుకుంటోంది. అసలు ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది..? దీని కథేంటి? వివరాలు తెలుసుకుందాం.

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా అవికా గోర్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇక ఈ సీరియల్ లో ముద్దు ముద్దుగా కనిపిస్తూ.. ప్రేక్షకులను అలరించింది. ఈ ధారావాహికతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ... పలు హిందీ సీరియల్స్ లో నటించింది. ఆ తర్వాత పలు హిందీ సినిమాల్లో కూడా నటించి.. బాగా పాపులర్ అయితే అయింది.

Prabhas Avika Gor 1920 Horrors of the Heart Movie Streaming Now on Disney Plus Hotstar Ott

ఇక తెలుగులో రాజ్ తరుణ్ తో కలిసి ఉయ్యాల జంపాల అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ మూవీకి మంచి కలెక్షన్స్ తో పాటు.. మంచి గుర్తింపు అయితే వచ్చింది. ఈ సినిమా తర్వాత లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావా అంటూ సినిమాలు చేసి సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ఈ భామకు అవకాశాలు వచ్చినా.. చేసిన సినిమాలు కలిసి రాలేదు.

Prabhas Avika Gor 1920 Horrors of the Heart Movie Streaming Now on Disney Plus Hotstar Ott

ఈ ఏడాది.. అవికా గోర్.. పాప్ కార్న్ అంటూ ఓ సినిమా చేసింది. ఈ సినిమాతోనైనా వెలుగులోకి వచ్చేద్దామనుకున్న ఈ భామకు మళ్లీ చుక్కెదురైంది. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక అవికా గోర్ ఈ ఏడాది హారర్ మూవీలో నటించింది. ఇప్పుడు ఆ సినిమాలో ఓటీటీలో రిలీజ్ అయి భయపెడుతోంది.

అవికాగోర్‌ నటించిన బాలీవుడ్‌ మూవీ '1920: హారర్స్‌ ఆఫ్‌ ది హార్ట్‌'. హారర్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి కృష్ణభట్‌ దర్శకత్వం వహించారు. తెలుగు, హిందీ, తమిళం భాషల్లో జూన్‌ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. తాజాగా ఇది డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ వేదికగా విడుదలైంది. ప్రస్తుతం హిందీ ఆడియో మాత్రమే అందుబాటులో ఉంది.

Prabhas Avika Gor 1920 Horrors of the Heart Movie Streaming Now on Disney Plus Hotstar Ott

ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే... తన తండ్రి ధీరజ్ అకాల మరణంతో మేఘన (అవికాగోర్‌) మనోవేదనకు గురవుతోంది. ధీరజ్‌ రాసిన ఓ పాత డైరీని మేఘన అనుకోకుండా చదువుతుంది. తండ్రి మరణానికి తన తల్లే కారణమని తెలుసుకుంటుంది. తన తల్లిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. తల్లిపై పగ తీర్చుకోవడానికి మేఘన ఏం చేసింది? పగ తీర్చుకునే క్రమంలో ఆమె తన ప్రియుడు అర్జున్‌ను ఎలా దూరం చేసుకుంది? ఇలాంటి ఆసక్తికర అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. మీరు గనకు హారర్ మూవీస్ ఇష్టపడితే ఈ మూవీని ఓటీటీలో ఓసారి చూసేయొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X