OTT: ఓటిటిలోకి ముందే వచ్చేసిన స్త్రీ 2.. 800 కోట్ల హారర్ థ్రిల్లర్ చూసేందుకు ఆ ఒక్క కండిషన్!
గత కొంత కాలం నుంచి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర డ్రై గా నడుస్తున్న సినీ పరిశ్రమల్లో బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఒకటి. కాగా బాలీవుడ్ సినిమా ఒకప్పుడు ఇండియన్ సినిమాకే కింగ్ లా ఉండేది కానీ నెమ్మదిగా మన తెలుగు సినిమాలు సౌత్ సినిమాల డామినేషన్ మొదలు కావడం హిందీ మార్కెట్ లో అవే రోత సినిమాలు వస్తుండడంతో హిందీ జనం కూడా థియేటర్స్ లో వెళ్లడం మానేశారు.
అలాంటి సమయంలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తన చిత్రాలు "పఠాన్, జవాన్" లతో వరుస బ్లాక్ బస్టర్ లు ఒకే ఏడాదిలో అందించి మళ్ళీ బాలీవుడ్ కి పూర్వ వైభవాన్ని అందించాడు. కాగా ఒకే ఏడాదిలో రెండు ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన ఏకైక హీరోగా హిందీ నుంచి షారుఖ్ ఖాన్ నిలిచాడు. కానీ ఇలాంటి బిగ్ స్టార్ సినిమాని కూడా ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా భారీ మార్జిన్ వసూళ్లతో కొడుతుంది అని మాత్రం చాలా మంది గ్రహించి ఉండకపోవచ్చని చెప్పాలి.

కాగా ఆ చిత్రమే "స్త్రీ 2". ప్రభాస్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ లో 2018 లో వచ్చిన హారర్ కామెడి థ్రిల్లర్ కి సీక్వెల్ గా ఒక ఊహించని అంచనాలు సెట్ చేసుకొని పార్ట్ 2 ఈ ఏడాది థియేటర్స్ లోకి వచ్చింది. మరి ఇలా రావడం రావడంతోనే స్త్రీ 2 సంచలన ఓపెనింగ్స్ అందుకొని మేల్ డామినేషన్ కనిపించే ఇండస్ట్రీలో మొట్ట మొదటిగా ఒక ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా రికార్డు ఓపెనింగ్స్ సాధించి ట్రేడ్ అనలిస్టులకి షాకిచ్చింది.
కాగా ఈ సినిమా వేట అక్కడ నుంచి మొదలై నాన్ స్టాప్ గా భారీ వసూళ్లు అందుకుంటూ హిందీ మార్కెట్ లో 600 కోట్లకి పైగా వసూళ్లు అందుకున్న మొట్ట మొదటి సినిమాగా నిలిచింది. అలాగే వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 800 కోట్లకి పైగా వసూళ్లు సాధించి ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాల్లో నెంబర్ 1 సినిమాగా స్టార్ హీరోల సినిమాలని సైతం దాటేసి ఆశ్చర్యపరిచింది.

ఇందుకే స్త్రీ 2 పై సంచలన హైప్ సెట్ అయ్యింది. కాగా ఇలాంటి సినిమాకి ఓటిటిలో కూడా డిమాండ్ ఉంటుంది. కాగా ఈ డిమాండ్ తోనే ఇప్పుడు స్త్రీ 2 ఓటిటిలో వచ్చేసింది. నేటి నుంచి ఈ చిత్రం పాపులర్ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో వీక్షకుల కోసం అందుబాటులోకి వచ్చేసింది. నిజానికి ఈ సినిమా రేపు సెప్టెంబర్ 27న రిలీజ్ కి రావాల్సి ఉంది కానీ ఒక రోజు ముందే స్ట్రీమింగ్ వచ్చేసింది అని చెప్పాలి.
కాకపోతే ఇక్కడ చిన్న మెలిక ఏమిటంటే ఈ సినిమాకి ఉన్న డిమాండ్ మేర 349 రూపాయలు చెల్లిస్తే కానీ చూసేందుకు వెసులుబాటు లేదు. సో ఓటిటిలో ప్రస్తుతానికి రెంటల్ గానే స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి థియేటర్స్ కి వెళ్లకుండా అక్కడ పెట్టే డబ్బులేదో ఓటిటికే పెడదాం అని చూసే వారికి అయితే ఇపుడు ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. ఇంకా ఫ్రీ స్ట్రీమింగ్ సంబంధించి క్లారిటీ అయితే ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్ కూడా ఉంది.


Click it and Unblock the Notifications











