OTT: ప్రభాస్ కల్కిని బీట్ చేయని దేవర, గేమ్ ఛేంజర్.. ఈ సినిమాల రైట్స్ ఎన్ని వందల కోట్లంటే?
ఇప్పుడు ఒక రకంగా ఓటీటీ మార్కెట్ దారుణంగా కుదేలైంది. ఒకప్పుడు తెలుగు సినిమాలకు కోట్లకు కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన ఓటీటీ సంస్థలు... ఇప్పుడు అసలు రేటు పెట్టడానికి కూడా ఆలోచిస్తున్న నేపథ్యంలో అనేక చిన్న సినిమాలు మిడ్ రేంజ్ సినిమాలు ఆపేసుకోవాలని నిర్మాతల భావిస్తున్నారు. అయితే ఇదంతా పాన్ ఇండియా సినిమాలకు మాత్రం ఏమాత్రం ఎఫెక్ట్ పడడం లేదు. తాజాగా మూడు బడా ప్రాజెక్టులకు సంబంధించిన ఓటీటీ డీల్స్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలు లోకి వెళ్లే ప్రయత్నం చేద్దాం.
బడా పాన్ ఇండియా చిత్రాల ఓటీటీ వివరాలు...
ప్రస్తుతానికి తెలుగు మార్కెట్ మీద అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్ సంస్థలు దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలోనే బడా సినిమాలన్నింటినీ కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పలు సినిమాలను ప్రకటించింది అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ. నెట్ ఫ్లిక్స్ కూడా ఆ మధ్య వరుసగా తాము స్ట్రీమింగ్ చేయబోయే సినిమాలకు సంబంధించిన ప్రకటనలు చేస్తూ వచ్చింది. ఇక ఇప్పుడు ఒక మూడు బడా పాన్ ఇండియా ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి.

ఎన్టీఆర్ దేవర...
ముందుగా దేవర మొదటి భాగం విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని ఎన్టీఆర్ సొంత సోదరుడు తన బ్యానర్ మీద కొరటాల శివ స్నేహితుడితో కలిసి నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి భారీ ఎత్తున ఓటీటీ డీల్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసినట్లుగా చెబుతున్నారు. సుమారు 155 కోట్ల రూపాయలకి ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసిందని సమాచారం. అంతే కాదు మిగతా భాషల్లో కూడా ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయబోతోంది.
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్...
ఇక రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాని శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ మీద అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి కూడా మంచి రేట్లు పలికాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ సినిమాని దాదాపు 105 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది హిందీ వర్షన్ మాత్రం జి సంస్థ కొనుగోలు చేసింది. మిగతా నాలుగు భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోస్ స్ట్రీమింగ్ చేయబోతోంది.

ప్రభాస్ కల్కి చిత్రం...
ఇక ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి 2829 ఏడీ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని వైజయంతి బ్యానర్ మీద అశ్వినీ దత్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఓటీటీ డీల్ భలే ఆసక్తి రేపుతోంది. ఈ సినిమా కోసం ఏకంగా 180 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తుంది సినిమా యూనిట్. ఈ సినిమాలు దక్కించుకునేందుకు నెట్ ఫ్లిక్స్ తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో పోటీ పడుతుంది.
ప్రభాస్ క్రేజే ఎక్కువ..
ఒకరకంగా చూస్తే ఆర్ఆర్ఆర్ హీరోల కంటే ప్రభాస్ క్రేజే ఎక్కువగా ఉందని ఈ రేట్లు చెబుతున్నాయి. ఇక విషయం తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ప్రభాస్ సినిమాలు అంటే ఆ మాత్రం క్రేజ్ ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











