Unstoppable 2 ఆ హీరోయిన్ ని పొగిడితే హర్ట్ అయ్యావ్ కదా.. బుక్కైన ప్రభాస్, బాలయ్యకు చేతులెత్తి మరి!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు డార్లింగ్. రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా ఈశ్వర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రభాస్ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయిన ఆయనపై అభిమానులకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గడంలేదు. ప్రభాస్ నుంచి ఎప్పుడెప్పుడు కొత్త సినిమా వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అభిమానుల కోసం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ 2 ద్వారా సూపర్ ట్రీట్ ఇవ్వనున్నారు.

 ఫొటోలు, వీడియో లీక్..

ఫొటోలు, వీడియో లీక్..

అన్‌స్టాపబుల్ గా సాగుతున్న అన్‌స్టాపబుల్ 2 సీజన్ తాజా ఎపిసోడ్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాటు అతనికి అత్యంత సన్నిహితుడు గోపీచంద్ కూడా హాజరయ్యారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. దీంతో ఆ ఎపిసోడ్ కు సంబంధించిన గ్లింప్స్ వదిలారు. ఇప్పుడు తాజాగా ఈ ఎపిసోడ్ మొదటి ప్రోమోను రిలీజ్ చేశారు.

సరే డార్లింగ్ సార్..

సరే డార్లింగ్ సార్..

ఒక మహారాజును ఆహ్వానిస్తున్నట్లుగా ప్రభాస్ ని షోలోకి స్వాగతం పలికాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. ప్రభాస్ ఎంట్రీతో సెట్ మొత్తం ప్రేక్షకుల అరుపులు, కీకలతో మారుమోగిపోయింది. సభాముఖంగా ప్రేమగా అడుగుతున్నాను.. నన్ను కూడా డార్లింగ్ అని పిలవాలని బాలయ్య అంటే సరే డార్లింగ్ సార్ అని ప్రభాస్ అన్నాడు. మొన్న శర్వానంద్ వచ్చాడు. పెళ్లెప్పుడని అడిగా.. ప్రభాస్ తర్వాత అన్నాడు అని బాలకృష్ణ అంటే.. నేను సల్మాన్ ఖాన్ తర్వాత అనాలేమో అని అందరినీ నవ్వించాడు ప్రభాస్.

అనవసరమైన గోల ఎక్కువ..

అనవసరమైన గోల ఎక్కువ..

నిన్ను ఒక స్పాట్ లో పెట్టి గేమ్ ఆడతాను అని బాలకృష్ణ అంటే ఎలాగు పెడతారని డిసైడ్ అయి వచ్చాను సార్ అని ప్రభాస్ అన్నాడు. మీ లైఫ్ లో మోస్ట్ రొమాంటిక్ సీన్ ఏది అని బాలయ్య అడిగాడు. మీకు అసలు ఏం పనులు లేవు అప్పుడు.. మాకు ఏమి లేకపోయిన అనవసరమైన గోల ఎక్కువ అని ప్రభాస్ అంటే.. అప్పుడు సంవత్సరానికి మేము ఎన్ని సినిమాలు చేశామో తెలుసా ఆని బాలకృష్ణ అన్నాడు. మరి ఆలోచించండి.. ఎన్ని న్యూస్ లు వచ్చి ఉంటాయో అని ప్రభాస్ మళ్లీ కౌంటర్ వేశాడు.

 మనోడు ఎలాగు స్లో కదా..

మనోడు ఎలాగు స్లో కదా..

శ్రుతి హాసన్ ను పొగుడుతుంటే చిన్నగా హర్ట్ అయ్యావ్ కదా అని ప్రభాస్ ను బాలకృష్ణ అడిగితే.. చేతులెత్తి దండం పెట్టాడు ప్రభాస్. తర్వాత ఫోన్ లో రామ్ చరణ్ మాట్లాడినట్లు తెలుస్తోంది. చెర్రి ఏదో చెబుతుంటే.. ఓ చరణో.. రేయ్ నువ్ నా ఫ్రెండ్ వా.. శత్రువా అని ప్రభాస్ అనడం ప్రతి ఒక్కరినీ నవ్వించేలా చేసింది. రాజమౌళి గారు బాహుబలి ప్లానింగ్ లో ఉన్నారు.. అప్పుడు రామారావు (జూనియర్ ఎన్టీఆర్) గారు లేదు లేదు చేసేయ్.. మనోడు ఎలాగు స్లో కదా.. ఓ సినిమా అయిపోద్ది అని అన్నాడని ప్రభాస్ చెప్పాడు. ఒకటి గట్టిగా వర్కౌట్ అయిందిలే అని బాలకృష్ణ అనడంతో అందరూ నవ్వేశారు.

 రాణి గురించే కదా సార్..

రాణి గురించే కదా సార్..

ఇంతలో గోపీచంద్ ఎంట్రీ ఇచ్చాడు. వచ్చిన గోపీచంద్ తో మనవాడు బెస్ట్ ఫ్రెండ్ అండీ అని రామ్ చరణ్ కు ఫోన్ చేశాడు. అతను చిన్న లీక్ న్యూస్ ఇచ్చాడు అని బాలకృష్ణ చెబుతుంటే.. రాణి గురించే కదా సార్ అని గోపీచంద్ అన్నాడు. దీంతో ఒరేయ్.. అని ఆపరా అన్నట్లుగా ప్రభాస్ అరిచాడు. దీంతో స్టేజ్ మొత్తం నవ్వులతో నిండిపోయింది. తర్వాత బాలకృష్ణకు అడ్డుగా గోపీచంద్ ఉంటే.. సార్ మీరు జరగండి సార్ అని ప్రభాస్ అన్నాడు.

డిసెంబర్ 30న పూర్తిగా..

ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ ఎపిసోడ్ కు సంబంధించి లీకైన ఓ వీడియోలో ప్రభాస్ డ్రెస్సింగ్, సైజ్ లపై బాలకృష్ణ మాట్లాడారు. "నీ షర్టులు అన్నీ 3XL, 4XL యేనా" అని బాలకృష్ణ అడిగితే.. "నాకు షూలు దొరకడం కష్టం. నా షూ సైజ్ 13" అని ప్రభాస్ సమాధానం ఇచ్చాడు. దీనికి బాలకృష్ణ "వెంకటేశ్వర స్వామి పాదం అంటారు దాన్ని" అని చెప్పారు. దీంతో ప్రభాస్ తో పాటు అక్కడున్న ప్రేక్షకులందరూ నవ్వేశారు. ఇక ఈ పూర్తి ఎపిసోడ్ ను న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 30న ఆహాలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X