Adipurush రికార్డు ధరకు ఓటీటీ రైట్స్ .. ఇండియాలోనే హయ్యెస్ట్.. ఆదిపురుష్ ఓటీటీ రిలీజ్ ఎక్కడ? ఎప్పుడు?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ నటించిన చిత్రం ఆదిపురుష్. వాల్మీకి రామాయణం ఆధారంగా సినీ పరిశ్రమలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా వీఎఫ్ఎక్స్ టెక్నాలజీతో దర్శకుడు ఓం రావత్ ఈ సినిమాను భారీగా తెరకెక్కించారు. ఇండియన్ సినిమాలో భారీ చిత్రాలను నిర్మించే భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్, ఓం రావత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్ ఈ సినిమాను నిర్మించారు. జూన్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ చిత్రం డిజిటిల్ లేదా ఓటీటీ రైట్స్ అమ్మకం విషయంలోకి వెళితే..
ఆదిపురుష్ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ఓం రావత్ తెరకెక్కించారు. సుమారు 500 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ సినిమాను సుందరంగా తీర్చి దిద్దారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది. థియేట్రికల్, శాటిలైట్ హక్కులకు భారీ డిమాండ్ ఉండటంతో ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోయాయి.

ఆదిపురుష్ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కుల విషయానికి వస్తే.. తొలుత యూవీ క్రియేషన్స్ ఈ హక్కులను దక్కించుకొన్నది. అయితే చివరి నిమిషంలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ రంగంలోకి దిగి భారీ రేటుకు థియేట్రికల్ హక్కులను దక్కించుకొన్నది. ఈ సినిమా హక్కులను సుమారు 165 కోట్ల మేర చెల్లించి థియేట్రికల్ హక్కులను చేజిక్కించుకొన్నట్టు సమాచారం.
ఆదిపురుష్ నాన్ థియేట్రికల్ హక్కులు బిజినెస్ కూడా భారీగా జరిగిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ సినిమా డిజిటల్ లేదా ఓటీటీ రైట్స్ 500 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకోవడం విశేషంగా మారింది.

ఆదిపురుష్ చిత్రం జూన్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. అమెజాన్, టీ సీరిస్ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం.. ఆదిపురుష్ చిత్రం 50 రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. అంటే.. సుమారు ఆగస్టు 4వ తేదీన అమెజాన్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











