OTT: ఓటీటీలో RRR రికార్డు గల్లంతు.. దుమ్ము రేపుతున్న సలార్
ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఓటీటీల హవా ఏ రీతిలో ఉందో తెలిసిందే. ఎన్నో పాపులర్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లు తమ ఉనికి కొనసాగించేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. అయితే ఓటీటీలో ఇప్పుడు మేజర్ గా సినిమాల స్ట్రీమింగ్ బాగా ఊపందుకుంది. ఒకప్పుడు కేవలం వెబ్ సిరీస్ లాంటివి మాత్రమే కనిపించేవి కానీ నెమ్మదిగా సినిమాలు కూడా ఇవ్వడం మొదలై అది ఆనవాయితీగా మారి ఇప్పుడు అలవాటు అయ్యిపోయింది.
కాగా ఇప్పుడు సినిమాల పరిస్థితి కూడా ఓటీటీ డీల్స్ మీదనే ఆధారపడి ఉంటున్నాయి. కొన్ని సినిమాలు అయితే స్టార్ట్ కాకముందే ఓటీటీ డీల్ అవ్వలేదో ఆ సినిమా ఆపేసే పరిస్థితికి వచ్చేస్తున్నారు. అయితే ఇలా ఓటీటీ లో వచ్చే పలు సినిమాలు భారీ రికార్డులు కూడా సెట్ చేస్తాయి. మరి అలా పలు స్ట్రీమింగ్ యాప్స్ లో ప్రతీ వారం కొన్ని సినిమాలు వరుసగా ట్రెండింగ్ లో నిలుస్తాయి కానీ కొన్ని వారాలు పాటు ట్రెండింగ్ లో కొనసాగుతాయి కానీ వీటిని మించి కొన్ని సినిమాలు అయితే హిస్టరీ క్రియేట్ చేస్తాయి.

కాగా ఇండియన్ సినిమా నుంచి అత్యధికంగా ట్రెండ్ అయ్యిన సినిమా ఏదన్నా ఉంది అంటే అది బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమా ఆర్ ఆర్ ఆర్ అని తెలిసిందే. కాగా ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఏకంగా 15 వారాలు కంటిన్యూస్ గా ట్రెండ్ అయ్యింది. అయితే ఇదే బిగ్గెస్ట్ రికార్డ్ అనుకుంటే దీనికి డబుల్ మార్జిన్ తో డార్లింగ్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బ్రేక్ చేసాడు. కాగా ప్రభాస్ నటించిన ఓ రీసెంట్ సినిమా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 250 రోజులు ఓటీటీలో ట్రెండింగ్ లో కొనసాగింది.
అంటే 35 వారాలకి పై మాటే అని చెప్పాలి. కాగా ఆ సినిమా ఏదో కూడా కాదు తనకి మాస్ కం బ్యాక్ ఇచ్చిన సెన్సేషనల్ ప్రాజెక్ట్ సలార్ సీజ్ ఫైర్. మరి దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా 700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కాగా ఓటీటీలో కూడా తెలుగు సహా ఇతర దక్షిణాది భాషల్లో నెట్ ఫ్లిక్స్ లోనే వచ్చింది కానీ అక్కడ సలార్ ఈ ఫీట్ సెట్ చెయ్యలేదు మరో ఓటీటీ లో సెట్ చేసింది.

కాగా సలార్ హిందీ వెర్షన్ ని డిస్నీ హాట్ స్టార్ వారు సొంతం చేసుకోగా అందులో వచ్చిన ఈ సినిమా ఏకంగా 250 రోజులు వరుసగా ట్రెండ్ అవుతూ వచ్చింది. దీనితో మొత్తం ఓటీటీ లలో హైయెస్ట్ వీక్స్ ట్రెండ్ అయ్యిన ఆర్ ఆర్ ఆర్ రికార్డును సలార్ ఒక్క హిందీ వెర్షన్ తోనే డబుల్ మార్జిన్ తో బ్రేక్ చేసింది అని చెప్పాలి. దీనితో ప్రభాస్ హిస్టరీ కూడా క్రియేట్ చేసాడు.. అయితే సలార్ ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది. మరి ఇంకెన్ని రోజులు ఇది కొనసాగుతుందో చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











