Prabhas Salaar OTT : దిమ్మతిరిగే రేటుకు సలార్ ఓటీటీ రైట్స్... రామ్ చరణ్‌ను బీట్ చేయలేకపోయిన ప్రభాస్!
దేశం మొత్తం ఎదురుచూస్తున్న సినిమాల్లో ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా ఒకటి. ఇక ఈ సినిమాకు కేజీఎఫ్ సిరీస్ ద్వారా దేశవ్యాప్త క్రేజ్ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాను డిసెంబర్ 22న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ నేపథ్యంలోనే మూవీ ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. అయితే ప్రభాస్... చరణ్ రికార్డును క్రాస్ చేయలేకపోయాడని తెలుస్తోంది. అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రెబల్ స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం సలార్. ఇక ఈ మూవీపై మొదటి నుంచి అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీని హోంబలే ఫిల్మ్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ కాగా.. జగపతి బాబు, పృథ్విరాజ్ సుకుమారన్, బాలీవుడ్ నటులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ కాక ముందే భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్.

ఇక సలార్ మూవీ.... డిసెంబర్ 22న క్రిస్మస్ హాలిడేస్ సందర్భంగా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హీందీ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీ ఓటీటీ హక్కులు కళ్లు చెదిరే మొత్తానికి అమ్ముడైనట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ మూవీని రూ.160 కోట్లు పెట్టి కొనుగోలు చేసిందట. దీంతో సలార్ ఓటీటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది.
ఇక డీల్ కుదుర్చుకోవడంతో... ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. మరోవైపు బడ్జెట్ లో సగం ఓటీటీపేరుతో వచ్చేసిందని తెలుస్తోంది. ఇక ప్రభాస్ కు సరైన హిట్ లేక.. సతమతవుతున్న సంగతి తెలిసిందే. బహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ పడలేదు. ఇక సాహో, రాదే శ్యామ్, ఆదిపురుష్ అనుకున్న స్థాయిలో ఆడలేదు. హ్యాట్రిక్ ఫ్లాపుల తర్వాత కూడా ప్రభాస్ కు ఉన్న క్రేజ్ తోనే ఈ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది.

అయినా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న సలార్ పై మాత్రం భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక అయితే ఓటీటీ డీల్ లో రామ్ చరణ్ రికార్డును ప్రభాస్ బ్రేక్ చేయలేకపోయాడు. రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్. ఇక ఈ మూవీకి శంకర్ దర్శకుడు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ మూవీ ఓటీటీ డీల్ ఇటీవల కుదిరినట్లు వార్తలు వచ్చాయి.

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 భారీ ధరకు విక్రయించింది. దాదాపు 250 కోట్ల రూపాయలు వెచ్చించి.. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళ భాషల ఓటీటీ రైట్స్ ను కొనుక్కోంది. సినీ పరిశ్రమలో ఇదే బిగ్గేస్ట్ డిలింగ్ అంట. అయితే ప్రభాస్ ఆ రికార్డును క్రాస్ చేయలేకపోయాడని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











