Salaar on Netflix సంచలనం రేపుతున్న ప్రభాస్ మూవీ.. నెట్‌ఫ్లిక్స్‌లో సలార్ రికార్డులు!
రెబెల్ స్టార్ ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్ నటించిన సలార్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకొన్నది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకొన్నది. ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగించుకొని ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నది. అయితే ఈ సినిమా ఓటీటీలో కూడా ఓ ప్రత్యేకతను సంతరించుకొని రికార్డు వ్యూవర్ షిప్‌ను కొనసాగిస్తున్నది. ఆ సలార్ ఓటీటీలో రేపుతున్న సంచలనం వివరాల్లోకి వెళితే..
సలార్ చిత్రం ప్రభాస్ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచే చిత్రంగా మారింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ రికార్డులను క్రియేట్ చేసింది. షారుక్ ఖాన్ నటించిన డంకీ సినిమాతో పోటీ పడుతూ ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపించింది. సలార్ పార్ట్ 1: సీస్‌పైర్ చిత్రం సుమారుగా 625 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఇక బాక్సాఫీస్ జైత్రయాత్రను ముగించిన తర్వాత సలార్ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలో రిలీజ్ చేశారు. ఈ భాషల్లో భారీగా రెస్సాన్‌ను సొంతం చేసుకొంటున్నది. సలార్ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఓటీటీ గ్లోబల్ చార్ట్‌లో 10వ స్థానంలో నిలిచింది.
ప్రభాస్ అభిమానుల నుంచి డిమాండ్ భారీగా రావడంతో.. తన కెరీర్‌లో ఇంతకుముందున్నడూ లేని విధంగా ఈ సినిమాను ఇంగ్లీష్ భాషలో కూడా ఓటీటీలో రిలీజ్ చేశారు. సలార్ సినిమాను ఇంగ్లీష్‌లో రిలీజ్ చేయాలని డిమాండ్ భారీగా వచ్చింది. దాంతో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులకు చేరువ చేశామని హోంబలే ఫిలింస్ అధికారికంగా ఇన్స్‌టాగ్రామ్‌లో వెల్లడించింది.

ఇంగ్లీష్ భాషలో రిలీజైన సలార్ చిత్రానికి మంచి స్పందన ఓటీటీలో నిలిచింది. ఇంగ్లీష్ వెర్షన్ కూడా టాప్ వ్యూస్‌ను సొంతం చేసుకొంటున్నది అనే విషయాన్ని వెల్లడించారు. ఇక ఈ సినిమాను ఇంగ్లీష్‌లో కూడా రిలీజ్ చేయడంపై అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











