OTT: స్పిరిట్ విలన్ యాక్షన్ ఫీస్ట్.. ఆ ఓటిటిలో కొరియన్ బాలయ్య సినిమాలు చూశారా?
ఇప్పుడిప్పుడే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ప్రపంచ వ్యాప్తంగా ఓ రేంజ్ లో షైన్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో ప్రముఖ నటీనటులు దర్శకులు ఒక భాష టెక్నీషియన్స్ మరో భాషకి చెందిన వారితో కోలాబ్ అవుతూ ఇండియన్ సినిమా తాలూకా స్పాన్ పెంచుతూ వెళుతున్నారు. కాగా ఇలా రానున్న రోజుల్లో హాలీవుడ్ కొలాబరేషన్స్ పాశ్చాత్య ఫేమస్ నటీనటులు కూడా ఇండియన్ సినిమాల్లో భాగం కాబోయే సూచనలు కూడా గట్టిగా కనిపిస్తున్నాయి.
కాగా ఇప్పటికే ప్రపంచ నెంబర్ 1 దర్శకుడు జేమ్స్ కామెరాన్ మన తెలుగు ప్రైడ్ దర్శకుడు రాజమౌళితో వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఇద్దరం కలిసి వర్క్ చేద్దామని కూడా తెలిపారు. ఈ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో సెన్సేషన్ గా మారిన కలయిక ఏదన్నా ఉంది అంటే అది కొరియన్ బాలయ్య డాన్ లీ మరియు మన పాన్ ఇండియా హీరో ప్రభాస్ ల కలయికలో రానున్న "స్పిరిట్" అంటూ పలు రూమర్స్ వచ్చి పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి.

దీనితో అసలు ఈ కొరియన్ నటుడు ఎవరు తన సినిమాలు ఏంటి అని చాలా మంది ఆరాలు తీయడం స్టార్ట్ చేశారు. అంతే కాకుండా తన ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్లి కూడా ప్రభాస్ తో నటించాలి అని ప్రభాస్ ఫ్యాన్స్ కోరారు. ఇలా డాన్ లీ కోసం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో పోస్ట్ లు కనిపించాయి. ప్రభాస్ కి కరెక్ట్ విలన్ అంటూ కూడా చాలా మంది అతన్ని ఫిక్స్ చేసేయాలని దర్శకుడు సందీప్ రెడ్డి వంగని కోరుకున్నారు.
అయితే ఈ క్రేజీ కలయిక దాదాపు సాధ్యం అయ్యే ఛాన్స్ ఉందని సినీ వర్గాల్లో కూడా టాక్ లేకపోలేదు. అయితే అసలు ఈ డాన్ లీ నుంచి ఎలాంటి ఫిల్మోగ్రఫీ ఉంది? తాను ఎలాంటి సినిమాలు చేశారు? ఓటిటిలో అది కూడా మన తెలుగులో ఏమన్నా చూడడగే సినిమాలు ఉన్నాయా అంటే డెఫినెట్ గా ఉన్నాయని చెప్పాలి. మెయిన్ గా యాక్షన్ జానర్ సినిమాలు బాగా ఇష్టపడే వారికి అయితే ఇప్పుడు మేము సజెస్ట్ చేసిన సినిమాలు క్రేజీ కిక్ ఇస్తాయి.

కాగా ప్రముఖ ఓటిటి యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే ఇప్పుడు చెప్పే సినిమాలు ఉన్నాయి. కాగా ఈ చిత్రాలే "ది అవుట్ లాస్", "ది రౌండప్" అలాగే దీనికి సీక్వెల్ "ది రౌండప్: నో వే అవుట్" సినిమాలు అని చెప్పొచ్చు. ఈ మూడు కూడా మాఫియా, డ్రగ్స్, గ్యాంగ్ వార్స్ సంబంధిత జానర్ లోనే కనిపిస్తాయి. కాగా డాన్ లీ ఒక పోలీస్ డిటెక్టివ్ గా కనిపించగా తాను చేసే ఫైట్స్ అయితే మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయి. ఒక్క దెబ్బతో మెడ విరిచేయగలడు ఎలాంటి వాడిని అయినా పడగొట్టేయగలడు.
ఇలాంటి యాక్షన్ ఎలిమెంట్స్ ఒక్కటే కాకుండా మంచి కామెడీ టైమింగ్ కూడా ఈ సినిమాల్లో తన నుంచి కనిపిస్తాయి. అయితే మన తెలుగు ఆడియెన్స్ కి ఈ సినిమాల్లో కథలు కొంచెం రొటీన్ గా అనిపించొచ్చు కానీ డాన్ లీ నుంచి గాని ఓటిటిలో ఓ క్రేజీ యాక్షన్ సినిమాలు చూడాలి అనుకునేవారు మాత్రం తప్పకుండా ఈ మూడు చిత్రాలని అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఇంట్రెస్టింగ్ గా ఈ మూడు సినిమాలు కూడా మన తెలుగు డబ్బింగ్ వెర్షన్ లో కూడా అందుబాటులో ఉన్నాయి, ఒకసారి ఈ సినిమాలు చూస్తే ప్రభాస్ కి తగ్గ విలనా కాదా అనేది మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. సో డోంట్ మిస్..


Click it and Unblock the Notifications











