Official: ఆదిపురుష్ వచ్చేది ఆ ఓటీటీలోనే.. స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే!
గతంలో కంటే ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని భాషల్లోనూ చారిత్రక, పౌరాణిక సినిమాల సంఖ్య బాగా తగ్గిపోయింది. దీంతో అలాంటి జోనర్లలో మూవీలు రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. వాళ్ల ఆశలను నిజం చేస్తూ వచ్చిన మైథాలజీ మూవీనే 'ఆదిపురుష్'. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమా రామాయణం నేపథ్యంతో రూపొందింది. భారీ బడ్జెట్‌ను వెచ్చించి మరీ దీన్ని విజువల్ వండర్‌గా తీర్చిదిద్దారు. ఇలా ఈ 'ఆదిపురుష్' సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
టెక్నికల్ వండర్‌గా రూపొందిన 'ఆదిపురుష్' మూవీకి అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే తెలుగు రాష్ట్రాలతో పాటు వేరే భాషల్లో సైతం ఈ చిత్రం పాజిటివ్ టాక్‌నే సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి స్పందన కూడా భారీగానే దక్కుతోంది. తద్వారా మొదటి రోజు షోలు దాదాపుగా ఫుల్ అయిపోయాయి. ఫలితంగా ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'ఆదిపురుష్' మూవీ ఓటీటీపై అఫీషియల్ అప్‌డేట్ వచ్చింది.

అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన 'ఆదిపురుష్' మూవీపై నెలకొన్న అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. అంతేకాదు, థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని అంటున్నారు. అంటే నేడు విడుదలైన 'ఆదిపురుష్' ఆగస్టు మూడో వారంలో అంటే దాదాపుగా ఆగస్టు 15వ తేదీన స్ట్రీమింగ్‌కు వస్తుందనే టాక్ ఫిలిం నగర్‌లో వినిపిస్తోంది.

'ఆదిపురుష్' మూవీలో ప్రభాస్ శ్రీరాముడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదుత్తా హనుమంతుడిగా చేశారు. దీన్ని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మించారు. అజయ్ - అతుల్ దీనికి సంగీతాన్ని సమకూర్చారు. ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా రూ. 240 కోట్లు బిజనెస్ చేసుకుని.. ఏకంగా 7000లకు పైగా థియేటర్లలో విడుదలైంది.


Click it and Unblock the Notifications











