Adipurush OTT: ఆదిపురుష్ ఓటీటీ డేట్ ఫిక్స్.. రిలీజ్ అయిన అన్ని రోజులకే!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రమే 'ఆదిపురుష్'. బాలీవుడ్‌లో చారిత్రక సినిమాల దర్శకుడిగా పేరొందిన ఓం రౌత్ దీన్ని తెరకెక్కించాడు. రామాయణం నేపథ్యంతో చెడు మీద మంచి ఎలా గెలిచింది అనే కాన్సెప్టుతో ఈ మూవీ రూపొందింది. దీని ద్వారానే ప్రభాస్ బాలీవుడ్‌లోకి నేరుగా అడుగు పెడుతున్నాడు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీశారు.

భారీ తారాగణంతో రూపొందిన 'ఆదిపురుష్' మూవీ జూన్ 16వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన టికెట్ బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి. అందుకు తగ్గట్లుగానే ఇది ఇండియాలోని అన్ని ఏరియాలతో పాటు ఓవర్సీస్‌లోనూ అదిరిపోయే స్పందనను సొంతం చేసుకుంటోంది. ఫలితంగా విడుదలకు ముందే ఈ సినిమా టికెట్లు భారీగా అమ్ముడుపోయాయి. దీంతో వరల్డ్ వైడ్‌గా ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' మేనియానే కనిపిస్తోంది.

Prabhas Starrer Adipurush Streaming After 8 Weeks of Theatre Release

టెక్నికల్ వండర్‌గా రూపొందిన 'ఆదిపురుష్' మూవీ ఓటీటీ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో అత్యధిక ధర చెల్లించి మరీ ఈ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది. ఇక, ఈ సినిమా స్ట్రీమింగ్ యాభై రోజుల తర్వాతనే ఉంటుందని ఇప్పటికే ప్రచారం మొదలైంది. అయితే, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. 'ఆదిపురుష్' థియేటర్లలో విడుదలైన 8 వారాల తర్వాతనే ఓటీటీలోకి వచ్చేలా నిర్మాతలు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థతో ఒప్పందం చేసుకున్నారట.

అంటే.. 'ఆదిపురుష్' మూవీ జూన్ 16న థియేటర్లలో విడుదల కాబోతుంది. దీనికి ఎనిమిది వారాలు అంటే ఆగస్టు మూడో వారం అవుతుంది. అప్పుడే ఇది స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు, ఆ దగ్గరలో అంటే ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం కూడా రాబోతుంది. దీంతో అదే రోజున ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ మొదలయ్యే చాన్స్ ఉన్నట్లు కూడా ఓ టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా.. 'ఆదిపురుష్' మూవీలో ప్రభాస్ రాముడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదుత్తా హనుమంతుడిగా చేశారు. దీన్ని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మించారు. అజయ్ - అతుల్ దీనికి సంగీతాన్ని సమకూర్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X