Kalki 2898 AD OTT: కల్కి ఓటీటీ వివరాలు లీక్.. ప్రభాస్ మూవీ ఎప్పుడు ఎందులో వస్తుందంటే!
తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులే కాదు.. ఇండియా వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు అందరి దృష్టిని ఆకర్షించిన సినిమాలు ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి. అలాంటి వాటిలో 'కల్కి 2898 ఏడీ' ఒకటి. రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం పాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కింది. అందుకు తగ్గట్లుగానే ఈ భారీ బడ్జెట్ సినిమా మొదటి నుంచీ హైప్‌ను క్రియేట్ చేసుకుంటూ వచ్చింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సినిమానే 'కల్కి 2898 ఏడీ'. టైం ట్రావెల్ కథతో విజువల్ వండర్‌గా రూపొందిన ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సినిమాను హై రేంజ్‌లో తెరకెక్కించారు. ఇలా ఎంతో హైప్ నడము ప్రభాస్ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

ఎంతో మంది స్టార్ల కాంబినేషన్‌లో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' మూవీకి సంబంధించి ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్స్‌తో పాటు మిగిలిన ప్రాంతాల్లో షోలు పడిపోయాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ షోలు వేశారు. దీనికి ఏరియాల్లోనూ దీనికి అదిరిపోయే మౌత్ టాక్ వచ్చింది. మరికొద్దిసేపట్లోనే ప్రభాస్ సినిమాకు సంబంధించిన ఫుల్ రివ్యూలు కూడా రాబోతున్నాయి.
'కల్కి 2898 ఏడీ' సినిమా సందడి ఇప్పటికే థియేటర్లలో మొదలైపోగా.. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు తాజాగా బయటకు వచ్చేశాయి. దీని ప్రకారం.. ఈ సినిమాను తీవ్ర పోటీ నడుమ అమెజాన్ ప్రైమ్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని సినిమా టైటిల్ కార్డులో రివీల్ చేశారు. ఇక, ఈ హక్కుల కోసం సదరు సంస్థ చిత్ర నిర్మాతలకు భారీ మొత్తాన్నే ముట్టజెప్పినట్లు టాక్.

రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి' సినిమాను థియేటర్లలోకి వచ్చిన నాలుగు వారాల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థతో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని కూడా ఓ న్యూస్ లీకైంది. అంటే జూన్ 27వ తేదీన విడుదలైన ఈ చిత్రం ఆగస్టు మొదటి వారంలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.
ఇదిలా ఉండగా.. టెక్నికల్ వండర్‌గా తెరకెక్కిన 'కల్కి 2898 ఏడీ' మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ ముఖ్యమైన పాత్రలు చేస్తున్నారు. ఈ భారీ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం ఇచ్చారు.


Click it and Unblock the Notifications











