Kalki 2898 AD OTT: ప్రభాస్ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్.. తెలుగు వెర్షన్ మాత్రం అందులోనే!

తెలుగు సినిమా స్థాయి పెరగడంతో ఈ మధ్య కాలంలో టాలీవుడ్ నుంచి హై రేంజ్ మూవీలు భారీ స్థాయిలో వస్తున్నాయి. ఇలాంటివే సక్సెస్‌లను కూడా సొంతం చేసుకోవడంతో ఇంకా ఇంకా అలాంటి సినిమాలు తెరకెక్కుతోన్నాయి. అలాంటి వాటిలో 'కల్కి 2898 ఏడీ' ఒకటి. రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్నాయి.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రమే 'కల్కి 2898 ఏడీ'. క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం టెక్నికల్ వండర్‌గా రెడీ అయింది. దీంతో ఈ చిత్రంపై ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ అయింది. అందుకు అనుగుణంగానే దీన్ని ఎన్నో అంచనాల నడుమ జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.

Prabhas Starrer Kalki 2898 AD Movie OTT Streaming From August 23rd

పాస్ట్ అండ్ ఫ్యూచర్‌కు సంబంధించిన కథతో రూపొందిన 'కల్కి 2898 ఏడీ'కి అన్ని ఏరియాల్లోనూ అదిరిపోయే మౌత్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా దక్కింది. ఫలితంగా ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టింది. ఇలా ఇప్పటికే రూ. 1100 కోట్లుకు పైగా గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి లాభాలను అందుకుంటోంది.

'కల్కి 2898 ఏడీ' సినిమాపై విపరీతమైన హైప్ ఉండడంతో ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులకు భారీ స్థాయిలో పోటీ ఏర్పడింది. దీంతో సౌత్ భాషల రైట్స్‌ను తీవ్ర పోటీ నడుమ అమెజాన్ ప్రైమ్ సంస్థ, హిందీ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకున్నాయి. ఈ రైట్స్ కోసం సదరు సంస్థ చిత్ర నిర్మాతలకు భారీ మొత్తాన్నే ముట్టజెప్పినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

Prabhas Starrer Kalki 2898 AD Movie OTT Streaming From August 23rd

ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' సినిమాను థియేటర్లలోకి వచ్చిన నాలుగు వారాల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారని టాక్ వచ్చింది. కానీ, సెప్టెంబర్ వరకూ దీన్ని తీసుకు రావడంలేదని అన్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని ఆగస్టు 23వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేసేందుకు అమెజాన్ ప్రైమ్ సిద్ధం అవుతోందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం.

ఇదిలా ఉండగా.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'కల్కి 2898 ఏడీ' మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ ముఖ్యమైన పాత్రలు చేస్తున్నారు. ఈ భారీ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్‌ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X