Kalki 2898 AD OTT: కల్కి ఓటీటీ స్ట్రీమింగ్‌పై ట్విస్ట్.. ఏకంగా అన్ని నెలలు వాయిదా!
టాలీవుడ్ నుంచి వచ్చే చిత్రాల్లో చాలా వరకూ దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను సొంతం సొంతం చేసుకుంటున్నాయి. అందులోనూ కొన్ని చిత్రాలు మాత్రం భారీ స్థాయిలో ప్రభావాన్ని చూపించి సెన్సేషన్‌గా మారుతున్నాయి. అలాంటి వాటిలో 'కల్కి 2898 ఏడీ' ఒకటి. రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం టైం ట్రావెల్ స్టోరీతో రూపొందిన విషయం తెలిసిందే.
రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సినిమానే 'కల్కి 2898 ఏడీ'. అత్యంత భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా రూపొందిన ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సినిమాను హై రేంజ్‌లో తీస్తున్నారు. ఇలా ఎంతో హైప్ నడము ప్రభాస్ సినిమా ఓ రేంజ్‌లో విడుదల అయింది.

మల్టీస్టారర్ మూవీగా రూపొందిన 'కల్కి 2898 ఏడీ'కి అన్ని ఏరియాల్లోనూ అదిరిపోయే మౌత్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా లభిస్తోంది. ఫలితంగా ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లను సాధిస్తోంది. ముఖ్యంగా మూడు రోజుల్లోనే ఈ మూవీ రూ. 400 కోట్లుకు పైగా గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది.
'కల్కి 2898 ఏడీ' సినిమాపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడడంతో.. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులకు భారీ స్థాయిలో పోటీ ఏర్పడింది. దీంతో సౌత్ భాషల రైట్స్‌ను తీవ్ర పోటీ నడుమ అమెజాన్ ప్రైమ్ సంస్థ, హిందీ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ హక్కుల కోసం సదరు సంస్థ చిత్ర నిర్మాతలకు భారీ మొత్తాన్నే ముట్టజెప్పినట్లు తెలిసింది.

రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' సినిమాను థియేటర్లలోకి వచ్చిన నాలుగు వారాల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారని టాక్ వచ్చింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని జూలైలో కాకుండా సెప్టెంబర్‌లో స్ట్రీమింగ్ చేస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందని తెలిసింది. ఇదే నిజం అయితే ప్రభాస్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ అనే చెప్పాలి.
ఇదిలా ఉండగా.. విజువల్ వండర్‌గా తెరకెక్కిన 'కల్కి 2898 ఏడీ' మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ ముఖ్యమైన పాత్రలు చేస్తున్నారు. ఈ భారీ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్‌ను కంపోజ్ చేశారు.


Click it and Unblock the Notifications











