Kalki 2898 AD OTT: ఓటీటీలోకి వచ్చేసిన 1200 కోట్ల మూవీ.. ఏ సీన్స్ యాడ్ చేశారంటే!

ఇప్పుడు ఇండియాలో ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీలు అన్నింట్లోనూ టాలీవుడ్‌ హై రేంజ్‌లో ఉంది అనే చెప్పాలి. ఇలా మన పరిశ్రమ స్టామినా పెరగడానికి ఎన్నో మంది కృషి ఉంది. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు రెబెల్ స్టార్ ప్రభాస్‌దే. అంతలా అతడు సుదీర్ఘ కాలంగా తనదైన చిత్రాలతో పాన్ ఇండియాపై దండయాత్ర చేస్తున్నాడు. తద్వారా గ్లోబల్ రేంజ్‌కు ఎదిగాడు.

రెబెల్ స్టార్ ప్రభాస్ రీసెంట్‌గా నటించిన సినిమానే 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD OTT). టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తీసిన ఈ భారీ బడ్జెట్ చిత్రం విజువల్ వండర్‌గా రెడీ అయింది. దీంతో ఈ చిత్రంపై ఓ రేంజ్‌లో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో హైప్ నడుమ జూన్ 27వ తేదీన వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేసేశారు.

Prabhas Starrer Kalki 2898 AD Movie Streaming Started On Amazon Prime

ఫుల్ లెంగ్త్ గ్రాఫిక్స్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'కల్కి 2898 ఏడీ' మూవీకి ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రానికి భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా దక్కింది. ఫలితంగా ప్రభాస్ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టింది. ఇలా ఇప్పటికే రూ. 1200 కోట్లుకు పైగా గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

'కల్కి 2898 ఏడీ' సినిమాపై హైప్ భారీ స్థాయిలో ఉండడంతో ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులకు ఓ రేంజ్‌లో పోటీ ఏర్పడింది. దీంతో సౌత్ భాషల రైట్స్‌ను తీవ్ర పోటీ నడుమ అమెజాన్ ప్రైమ్ సంస్థ, హిందీ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకున్నాయి. ఈ రైట్స్ కోసం సదరు సంస్థ చిత్ర నిర్మాతలకు భారీ మొత్తాన్నే ఇచ్చినట్లు ఇప్పటికే సమాచారం లీకైంది.

Prabhas Starrer Kalki 2898 AD Movie Streaming Started On Amazon Prime

ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' సినిమాను థియేటర్లలోకి వచ్చిన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ, దీన్ని మరింత ఆలస్యం చేస్తూ వచ్చారు. ఇలా తాజాగా ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ సంస్థ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకు వచ్చింది. అంతేకాదు, గతంలో చిత్ర యూనిట్ కట్ చేసిన కొన్ని సన్నివేశాలను సైతం ఇందులో యాడ్ చేసినట్లు తెలిసింది. దీంతో ఈ చిత్రం కోసం సినీ ప్రియులంతా ఎగబడుతున్నారు.

ఇదిలా ఉండగా.. హై రేంజ్ యాక్షన్‌తో 'కల్కి 2898 ఏడీ' మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ ముఖ్యమైన పాత్రలు చేస్తున్నారు. ఈ భారీ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్‌ కంపోజ్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X