Salaar: ఓటీటీలో ప్రభాస్ ఆల్‌టైం గ్రేట్ రికార్డు.. ఇండియాలోనే తొలి చిత్రంగా సలార్ ప్రభంజనం
కృష్ణంరాజు ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. దీనికితోడు 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అప్పటి నుంచి వెనక్కంటూ చూడకుండా వెళ్తున్నాడు. ఇలా వరుసగా భారీ భారీ సినిమాలతో వస్తూ ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తున్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది ప్రభాస్ 'సలార్: సీజ్‌ఫైర్' అనే సినిమాను చేశాడు. భారీ రెస్పాన్స్‌తో కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలో చరిత్ర సృష్టించింది. ఆ సంగతులేంటో మీరే చూసేయండి!
సలార్‌గా రెచ్చిపోయిన ప్రభాస్
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తీసిన మాస్ సినిమానే 'సలార్'. ఈ మూవీ హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మించారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేశారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం ఇచ్చాడు. ఇందులో శ్రీయా రెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావు సహా ఎంతో మంది నటించారు.

భారీ స్పందనతో కోట్ల వసూళ్లు
రెబెల్ స్టార్ ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. ఫలితంగా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ లభించింది. దీంతో ఈ చిత్రం రూ. 600 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సూపర్ హిట్ అయింది. అదే సమయంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కించింది.
నెట్‌ఫ్లిక్స్‌లోకి.. ట్రెండింగ్‌లోనే
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'సలార్: సీజ్‌ఫైర్' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఇందులో థియేటర్లలో కంటే ఈ చిత్రం మరింతగా భారీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా ఇండియాలోని బెస్ట్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. ఇలా చాలా వారాల పాటు ప్రభాస్ సినిమా టాప్‌లో ట్రెండింగ్ అయింది.

ఆ మార్క్ దాటిన ఫస్ట్ మూవీ
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి నెట్‌ఫ్లిక్స్‌లో అదిరిపోయే స్పందన లభించింది. ఫలితంగా ఈ చిత్రం కొద్ది రోజుల క్రితమే 20 మిలియన్ వ్యూస్ సాధించిన సినిమాగా నిలిచింది. తద్వారా వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న తొలి భారతీయ చిత్రంగా ఇది రికార్డు సాధించింది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ కూడా వెల్లడించింది.
ఆ సినిమాలను వెనక్కి నెట్టి
ప్రభాస్ నటించిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీ ప్రస్తుతానికి 21 మిలియన్ వ్యూస్‌తో టాప్ ప్లేస్‌లో ఉంది. దీని తర్వాత వరుసగా RRR 16.2 మిలియన్లు, ఫైటర్ 14 మిలియన్లు, యానిమల్ 13.6 మిలియన్లు, గంగూభాయ్ 13.4 మిలియన్లు, సైతాన్ 13 మిలియన్లు, లాపట్ట లేడీస్ 11.2 మిలియన్లు, జవాన్ 10.9 మిలియన్లు, డంకీ 10.8 మిలియన్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











